బడా హీరోలైన మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి దర్శక దిగ్గజం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా అయిన ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ వాక్చాతుర్యానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అతని చార్మింగ్ పర్సనాలిటీని బుల్లి తెర(బిగ్ బాస్), వెండితెరలపై చూస్తుంటేనే అందరూ మంత్రముగ్ధులవుతారు. రామ్ చరణ్ కూడా చాలా మంచి మనస్తత్వం కలిగినవాడు. తన వ్యక్తిత్వం కూడా అందరితో కలిసిపోయేలా ఉంటుంది. మరి ఇటువంటి ఇద్దరు బడా హీరోలు కలిసి నటిస్తోన్న క్రమంలో వారి మధ్య స్నేహం ఎంతగా చిగురిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ప్రస్తుతం ఏ సందేశాన్ని ఇవ్వాలన్నా రామ్ చరణ్, తారక్ కలిసే ఇస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఒకరికొకరు ఎంతో స్నేహపూరితంగా మెలుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ కి చాలా దగ్గర అవుతూ వస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఏకంగా బావ అని పిలిచే వారి మధ్య ఉన్న స్నేహ భావాన్ని చెప్పకనే చెప్పేసాడు తారక్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కి తారక్ ఒక చాలెంజ్ ని ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తారక్ ఇచ్చిన ఛాలెంజ్ ని చాలా సంతోషంగా స్వీకరించిన చిరంజీవి ఇంట్లో పనులను చేసి, వీడియో తీసి నెట్టింట షేర్ చేసి చాలెంజ్ పూర్తిచేశాను తారక్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఛాలెంజ్ లో రాంచరణ్ కూడా భాగస్వామ్యం అవ్వాలంటూ చిరంజీవి విజ్ఞప్తి చేశాడు.


ఏదేమైనా రాజమౌళి ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని రామ్ చరణ్, తారక్ ల మధ్య గట్టి స్నేహం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఐతే వీళ్లిద్దరి స్నేహం ఇంకా దృఢపడి ఎక్కువకాలం కొనసాగాలని చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు కూడా తారక్ చెర్రీ స్నేహ బంధాన్ని చూస్తూ ఫిదా అయిపోతున్నారు. రెండు బడా ఫ్యామిలీల నుండి వచ్చిన స్టార్ హీరోల మధ్య ఇంత స్నేహం చిగురించడం ఇదే మొదటి సారి అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: