కరోనా సమస్య ప్రపంచాన్ని కుదీపేస్తున్న పరిస్థితులలో రకరకాల జ్యోతిష్కులు రంగంలోకి దిగి ప్రపంచ భవిష్యత్ పై తమ అంచనాలు తెలియచేస్తున్నారు. అయితే ఇప్పుడు సింగపూర్ నుండి దిగుమతి అయిన జ్యోతిష్యం నిరాశలో ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ముఖ్యంగా టాప్ హీరోలకు జోష్ ను కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  


అయితే ఈ జోతిష్యం చెప్పింది సిద్ధాంతులు కారు. ప్రముఖ సింగపూర్ యూనివర్సిటీకి సంబంధించిన కొందరు సోషల్ సైంటిస్ట్ లు ప్రపంచం నుండి కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుందో చెపుతూ విడుదల చేసిన ఒకరిపోర్ట్ ప్రకారం ఇండియాలో మే 21 నాటికి కరోనా పూర్తిగా 97 శాతం తొలగిపోతుందని తెలియచేసింది. 


భారత ప్రభుత్వం కరోనా కు సంబంధించి ప్రతిరోజు విడుదల చేస్తున్న డేటాను ఆధారంగా చేసుకుని సింగపూర్ యూనివర్సిటీ ఈరిపోర్ట్ ను తయారు చేసింది అని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మే 29 నాటికి కరోనా పరారై పోతుందని అమెరికాలో మే 11 నాటికి కరోనా అదృశ్యమైపోతే స్పెయిన్లో మే 9 ఇటలీలో మే 7 ఇరాన్ లో మే 10  టర్కీలో మే 15 ఫ్రాన్స్ లో మే 3 జర్మనీలో ఏప్రిల్ 30 కెనడాలో మే 16 నాటికి కరోనా మాయమైపోతుందని సింగపూర్ యూనివర్సిటీ వేసిన అంచనాలు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల వరకు చేరడంతో ఇప్పుడు ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆ రిపోర్ట్ నిజం కావాలని ఆ దేవుడుని కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఊహించిన విధంగా మే నెలాఖరుకు ఇండియా నుండి కరోనా మాయం అయిపోయినా ముందుగా సినిమా షూటింగ్ లు మాత్రమే మొదలు అవుతాయని ఆ తరువాత మాత్రమే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జూలై ప్రాంతాలలో ధియేటర్లు ఓపెన్ కావచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. 


అసలు థియేటర్లు ఓపెన్ చేస్తే జనం వస్తారో ? రారో అన్నది తెలుసుకోవడానికి ముందుగా చిన్న సినిమాలను వదిలి కొద్దిరోజులు గడిచాక మాత్రమే మిడిల్ రేంజ్ సినిమాలు పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ధియేటర్ల ఓపెనింగ్ ఎలా ఉన్నా టాప్ హీరోలు మాత్రం వారి సినిమాలకు సంబంధించి షూటింగ్ ల బిజీలో నిమగ్నం అయిపోవడానికి సింగపూర్ జోష్యం నిజమైతే బాగుండును అంటూ వారి వారి ఇష్టదైవాలను కోరుకుంటున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: