సమ్మర్ కోసం చాలా మంది స్టార్స్  ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సమ్మర్ ను నమ్మకుని రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసుకున్న వారికి కరోనా  హ్యాండిచ్చింది.  ఏప్రిల్ 2 న దాదాపు అయిదారు సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోన్న అనుష్క నిశ్శబ్ధం మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని చూశారు. ఇక ఇదే రోజు రానా అరణ్య సినిమా రిలీజ్ అని ఎనౌన్స్  కూడా  చేశారు. కాని కరోనా క్రైసిస్ వల్ల సినిమాల తలరాతలే మారిపోయాయి..  ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తారోకూడా తెలియని పరిస్థితి ఇప్పుడు.

 

ఇక ఇదే ఏప్రిల్ 2 న రెండు లవ్ స్టోరీమూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. అందులో నాగచైతన్య-సాయి పల్లవి లవ్ స్టోరీతో పాటు వైష్ణవతేజ్ హీరోగా ఉప్పెన సినిమా కూడా రిలీజ్ కావల్సి ఉంది. కాని ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాని పరిస్థతి ఏర్పడింది. దాంతో ఈ సినిమాలు జూన్ - జులై వైపు చూస్తున్నాయి. 

 

ఏప్రిల్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న హీరోలకు ఈ సారి డిసప్పాయింట్ మెంటే మిగిలింది. లాస్ట్ ఇయర్ సమ్మర్ బాగా కలిసొచ్చిన నాని.. తన సినిమా .. వి..ని ఉగాదికి రిలీజ్ చేద్దామనుకున్నారు .  కాని కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది.. ఇక ఏప్రిల్ లో అయినా కుదురుతుందేమో అని చూశాడు. కాని లాక్ డైన్ పొడిగింపుతో.. ఆ ఆశలు కూడా నిలవలేదు.. ఇక ఫెయిల్యూర్స్ నుంచి ఈ మధ్యే బయట పడ్డ రామ్ రెడ్ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేసి ఈ ఏడాది ఇంకో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కారోనా లాక్ డౌన్ పొడిగింపుతో అది కూడా కుదరలేదు. 
 


ఏప్రిల్  లో కరోనా ఎపెక్ట్ తో శూన్యమాసం గామారడంతో ఇప్పుడు సమ్మర్ తరువాత ఎటు చూడాలా అని అనుకుంటున్నారు.. రాజ్ తరుణ్ ఓరెయ్ బుజ్జిగాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు... ప్రదీప్ కూడా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో  హీరోగా ఈ నెలలోనే లాంచ్ అవ్వాల్సి ఉంది.. ఇక కీర్తి సురేష్ మిస్ ఇండియా.. ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య.. అల్లుడు అదుర్స్ లాంటి సి నిమాలతో కళకళలాడాల్సిన ఏప్రిల్ , మే నెలలు  ఇప్పుడు వెల వెల బోతున్నాయి.

 

సమ్మర్ సీజన్ అంటేనే కోట్లలో బిజినెస్ అయ్యే సీజన్ ఒక్క టాలీవుడ్ లోనే దాదాజు 500 కోట్లకు పైగా బిజినెస్ లాస్ అవ్వబోతోంది లాక్ డౌన్ వల్ల.ముఖ్యంగా ఏప్రిల్.. మే నెలలు క్లోజ్ అవ్వడం తో రిలీజ్ లు ఎప్పుడు పెట్టుకోవాలా.. అనే డైలమాలో పడ్డారుమూవీ మేకర్స్. ఒక్క ఏప్రిలే కాదు సమ్మర్ సీజన్ అంతా ఇలానే కనిపించబోతుంది. మే ఫస్ట్ న సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు.. ఫస్ట్ వీక్ లో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రవితేజ క్రాక్ సినిమాలు సేఫ్ గా మేలో రిలీజ్ చేయాలని చూశారు.  కానీ ఈ లాక్ డౌన్ ఎప్పుడు  ఎండ్ అవుతుందో తెలీదు. లాక్ డౌన్ అయిపోయినా కూడా సినిమా థియేటర్లుస్టార్ట్ అవుతాయో లేదో కూడా తెలీడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: