ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ గంగమాల రత్నం యొక్క కుమారుడైన సుధాకర్ మొదటిలో ప్రతినాయకుడిగా, ఆ తర్వాత సాధారణ నటుడిగా, ఆపై హాస్యనటుడిగా తెలుగు ప్రజలను ఎంతగానో అలరించారు. తమిళ ఇండస్ట్రీలో కూడా ఒక ఊపు ఊపిన సుధాకర్ సినీ కెరీర్ ని కొంతమంది కావాలనే నాశనం చేశారని కొంత మంది సినీ ప్రముఖులు చెబుతుంటారు. తన తమిళ సినీ కెరియర్ బాగోలేకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి కమెడియన్ గా స్థిరపడి పోయాడు సుధాకర్. ఇతనిలో ఒక అరుదైన టాలెంటెడ్ కమెడియన్ ఉన్నారని చెప్పుకోవచ్చు.


మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ ల మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గా మారకముందు వరప్రసాద్ గా ఉన్నప్పుడే చిరంజీవికి తనకి మధ్య స్నేహం ఏర్పడిందని సుధాకర గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ తో కలసి సుధాకర్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ క్రమంలోనే చిరంజీవి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తో సుధాకర్ కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సుస్వాగతం లో పవన్ కళ్యాణ్ కి స్నేహితుడిగా నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ సుధాకర్ ని ఒరేయ్ అని పిలవడానికి బాగా ఇబ్బంది పడ్డాడని సుధాకర్ చెప్పుకొచ్చారు. గోకులంలో సీత చిత్రీకరణ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ సుధాకర్ ని ఒరేయ్ అని పిలిచేందుకు తెగ ఇబ్బంది పడి పోతుంటే... పవన్ నువ్వు నన్ను కాదు అనేది నా పాత్రను మాత్రమే ఏం కాదు అరేయ్, ఒరేయ్ అనేసెయ్ అంటూ చెప్పానని సుధాకర్ అన్నారు.


ఇప్పటికీ తమ మధ్య స్నేహబంధం ఎప్పటిలాగానే ఉందని... సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఎదుగుదల చూసి తాను ఎంతో సంతోష పడుతున్నాని సీనియర్ కమెడియన్ సుధాకర్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా సుధాకర్ ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే వాడేమో. మన అందరినీ నవ్వించిన అతని జీవితంలో విషాదం మాత్రమే మిగిలిపోవడం ఎంతో దురదృష్టకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: