తెలుగు సిని పరిశ్రమలో వారసత్వంగా వచ్చి చాలా మంది నటులు అగ్ర హీరోలుగా ఎదిగారు. ఈ తరహాలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ కేవలం వారసత్వం గానే కాక తన నటన, గ్లామర్ తో అయిదు పదుల వయసులో కూడా దూసుకు పోతున్నారు. బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఒకింత ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతారు. మరి లాకా డౌన్ నేపధ్యంలో ఇంటికే పరిమితమైన బోయపాటి, బాలయ్య తో చేయబోతున్న సినిమా గురించి టి వి చానెల్ ద్వారా ప్రేక్షకులకు తెలియ చేసారు.
వివరాల్లోకి వెళితే తాజాగా బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్లో తన 106 సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కు సంబంధించి స్టోరీని బయటపెట్టారు దర్శకుడు బోయపాటి. టాలివుడ్ లో బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటేనే మంచి క్రేజీ కాంబినేషన్. మరి వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. అందులో ఒకటి సిటి లో ఉండే పాత్ర కాగా, రెండవది అడవులలో ఉండే అఘోరా పాత్రగా తెలుస్తుంది.ఈ సినిమాలో శివుని భక్తునిగా బాలయ్య పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం.
అయితే తాజాగా ఈ విషయాలన్నిటిని బోయపాటి శ్రీను ఒక టి వి చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో వెల్లడించారు. మరి బాలయ్య లోని ఈ కోణం ఎలా ఉండబోతుందో అని బాలయ్య అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తి కనబడుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు భారి విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి ఈ సినిమా పై కూడా భారి అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ మాత్రం వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.