కరోనా ఉపద్రవం రాకుండా ఉండి ఉంటే ఈనెల 15న పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల అయి ఉండేది. ఎట్టి పరిస్థితులలోను ఈ మూవీని అనుకున్న డేట్ కు విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యంతో సినిమాల షూటింగ్ ల విషయంలో అశ్రద్ధ చేసే పవన్ కళ్యాణ్ చేత దిల్ రాజ్ వేణు శ్రీరామ్ లు పరుగులు తీయించినా ఊహించని ఉపద్రవంగా వచ్చిన కరోనా పవన్ అభిమానుల ఉత్సాహన్ని నీరు కార్చింది.

 

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఎప్పుడు ముగింపుకు వస్తుందో తెలియని పరిస్థితులతో పాటు తెలుగు రాష్ట్రాలలో తిరిగి ధియేటర్లు తెరుచుకోవాలి అంటే కనీసం రెండు నెలలు పట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనితో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ‘వకీల్ సాబ్’ ను ఆగష్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలి అన్న ఊహలలో దిల్ రాజ్ ఉన్నట్లు టాక్. 

 

దిల్ రాజ్ ఊహలకు మరింత బలం చేకూరుస్తు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన లేటెస్ట్ ట్విట్ ‘వాట్ ఈజ్ కమింగ్ ఈజ్ బెటర్ దెన్ వాట్ ఈజ్ గాన్’ (What is coming is better than what is gone) పవన్ అభిమానులలో కొత్త ఆశలను రేపుతోంది. తమన్ ఇస్తున్న లీకులను బట్టి మే 15న ‘వకీల్ సాబ్’ లోని మరొక పాట విడుదల కాబోతోంది అన్న సంకేతాలు రావడమే కాకుండా ఆ పాట ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘మగువ మగువా’ పాట ట్యూన్ కన్నా చాల బాగుంటుంది అన్న లీకులు పవన్ అభిమానులకు అందుతున్నాయి. 

 

దీనితో ఈ నెల 15న విడుదల కాబోయే ఈ మూవీలోని 2వ పాట కోసం పవన్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడ ఈ పాటతో రిలీజ్ చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పై దిల్ రాజ్ భారీగా ఖర్చు పెట్టిన పరిస్థితులలో ఈ రెండవ పాట విడుదల ద్వారా ‘వకీల్ సాబ్’ పై ఈ లాక్ డౌన్ సమయంలో కూడా భారీ క్రేజ్ క్రియేట్ చేసి ఈ సినిమా బిజినెస్ కు కరోనా కష్టాలు కూడ ఏమి చేయలేవు అన్న ఆలోచనలో ప్రస్తుతం దిల్ రాజ్ ఉన్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: