టాలీవుడ్ లో అతి తక్కువ మంది స్టార్ డైరెక్టర్స్ లో తనకంటూ మాస్ ఇమేజ్ సంపాదించాడు హరీష్ శంకర్. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు తన కథల్లో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రేక్షకుల అందించాడు. ఆ దెబ్బతో హరీష్ శంకర్ ఒక్కసారే టాలీవుడ్ లో స్పెషట్ ఎట్రాక్షన్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోలతో మనోడికి బాగా కనెక్ట్ ఉంది. గతంలో పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా గద్దల కొండ గణేష్ లాంటి సూపర్ హిట్ తో వరుణ్ తేజ్ కి మంచి విజయాలు అందించాడు. ఇప్పుడు మనోడి చూపు మెగాస్టార్ చిరంజీవిపై పడింది.
తాాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో ఓ ప్రాజెక్ట్ పనిలో ఉన్నానని అన్నారు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానం అన్నారు. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగానని ఇండస్ట్రీకి రావడానికి మెగాస్టార్ స్ఫూర్తి అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంట్ చేస్తూ.. దేవీశ్రీప్రసాద్ తనను నామినేట్ చేశాడని తెలిపాడు. కానీ నిజం చెబుతున్నా, తాను పని చేసాను అంటే కేవలం వీడియో కోసం చేయాలని తెలిపాడు.
ఎందుకంటే ఇంట్లో పూచికపుల్ల పని కూడా తనకు చెప్పరని పేర్కొన్నాడు. తిన్న కంచం సింక్ లో వేసే వరకు తెలుసని.. ఇంట్లో డబుల్ పని చేయడం తన సతీమణికి ఇష్టముండదని అన్నారు. తనకు మెగాస్టార్ తో రౌడీ అల్లుడు లాంటి ఎంటర్టైనర్ చేయాలని ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అలాగే చరణ్ తో కూడా చేసేస్తే మొత్తం మెగా హీరోలను కవర్ చేసిన సంతృప్తి వచ్చేస్తుందని అన్నాడు. తప్పకుండా ఆ ప్రయత్నం నెరవేరుతుందనే అనుకుంటున్నాను.