కొందరి నటీనటుల జీవితాల్లో వెలుగులు సినీ తెర మీద వెలిగినంత అందంగా నిజ జీవితంలో వెలగవు. తెర మీద నవ్వులు.. తెర వెనుక బాధలుగా కొందరి జీవితాలు ఉంటాయి. హిందీతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను ఎనభై దశకంలో ఏలేసిన నటి సిల్క్ స్మిత. కవ్వించే చూపులు, సెక్సీ ఫిగర్ తో సిల్క్ స్మిత పలు పాత్రలతో పాటు స్పషల్ సాంగ్స్ చేసి ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. అంత వెలుగు వెలిగిన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 

 

ముఖ్యంగా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఓ దశలో సిల్క్ స్మిత పాట లేనిదే సినిమా లేదు అనేంతగా ఆమె రేంజ్ పెరిగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఓ గ్రామంలో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి వెళ్లిన తర్వాత స్మితగా పేరు మార్చుకుంది. తమిళ్ లో బండిచక్రం అనే సినిమాలో సిల్క్ పేరుతో ఓ పాత్రలో నటించింది. అప్పటి నుంచి సిల్క్ స్మితగా మారి భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఎంతగా అంటే ఆమె సంపాదించిన డబ్బుతో ఏకంగా సినిమాలు నిర్మించేంతగా ఆమె సంపాదన పెరిగిపోయింది.

 

 

కానీ.. నిర్మాణ రంగం స్మితకు ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో ఆమె ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. తీవ్ర మనోవేదనతో సిల్క్ స్మిత తన 36వ ఏటనే చెన్నైలోని ఆమె స్వగృంలో ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో డర్టీ పిక్చర్ పేరుతో 2011లో సినిమా కూడా తీశారు. సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించింది. నిర్మాణంలో ఉండగానే ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా దాదాపుగా ఆమె నిజ జీవితానికి దగ్గరగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: