టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో శ్రీకాంత్. ఒకప్పుడు అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పుడు ఒక మంచి సినిమా చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు అతను హీరోగా మినహా ఇతర పాత్రలు అన్నీ చేస్తున్నాడు గాని ఒక్కటి కూడా హిట్ అవ్వడ౦ లేదు. కొడుకుని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు. నిర్మలా కాన్వెంట్ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు కొడుకుని పెట్టుకుని ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ విలన్ గా ఒక సినిమా చేస్తున్నాడు. 

 

బాలకృష్ణ సినిమాలో అతను విలన్ అని అంటున్నారు. ఆ సినిమా కోసం అతను ఎక్కువ సమయం కేటాయించాడు అని అంటున్నారు. ఈ సినిమా తర్వాత అతను కొడుకుతో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్న్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ చేసే సినిమా ఈ ఏడాది చివర్లో లాక్ డౌన్ పూర్తి అయితే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది కూడా చెప్పడం దాదాపుగా కష్టమే. ఈ సినిమా కోసం అతను చాలా మారారు అని కూడా సమాచారం. ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ కి బాలీవుడ్ లో విలన్ గా కూడా ఒక ఆఫర్ వచ్చింది అని అంటున్నారు. 

 

దాని మీద పెద్దగా స్పష్టత లేదు గాని రామ్ చరణ్ చేసే సినిమాలో అతనికి మాత్రం మంచి ఆఫర్ వచ్చింది అని అంటున్నారు. ఆ సినిమాలో అతను కుటుంబ పెద్దగా నటించే సూచనలు ఉన్నాయని సమాచార. రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి చేస్తాడా లేదా ఆ సినిమా అనేది చూడాల్సి ఉంది. శ్రీకాంత్ ఇప్పుడు ఖాళీ గానే ఉన్నాడు. కొడుకు సినిమా కథ రెడీ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: