కరోనాపై ప్రజలకు అవగాహన కలిపించడం లో అందరికంటే ముందు వరసలో ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అలాగే సాంగ్ రూపంలో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పిన చిరు తాజాగా నేషనల్ మీడియా ద్వారా కూడా మరోసారి అలాంటి సందేశాన్ని ఇచ్చాడు. అందులో భాగంగా నిన్న రిపబ్లిక్ టీవి ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిరంజీవి దేశ వ్యాప్తంగా వున్న తెలుగు వారి కోసం తెలుగులో సందేశం ఇచ్చాడు. కరోనా శాశ్వతం గా ఉండిపోదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని కూడా కాపాడుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన రిపబ్లిక్ టీవి  యాజమాన్యానికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. 
ఇక కరోనా వల్ల సినిమా, సీరియళ్ల షూటింగ్ లు ఆగిపోయాయి అలాగే ఇప్పటికే విడుదలకావల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం ఏమాత్రం  తగ్గకపోవడంతో ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగలే వుంది. దీనివల్ల ఇప్పటికే చిత్ర సీమ కొన్ని వందల కోట్లు నష్టపోయింది. అయితే తెలంగాణ లో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకైనా అనుమతులివ్వాలని టాలీవుడ్ నిర్మాతలు ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరగా అందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. అలాగే సీరియళ్ల షూటింగ్ విషయంలోనూ పర్మిషన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: