టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కొత్తదనం కోరుకునే ప్రయత్నంలో ఉన్నారు. చిన్న చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల వరకు కూడా అందరూ ఇప్పుడు మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసారు కాబట్టి సినిమాల్లో తమ పాత్రల మీద ఎక్కువగా రెగ్యులర్ వద్దు అనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొత్తధనానికే ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. కథో భిన్నం గా ఉండటమే కాకుండా వాళ్ళు చేసే పాత్రలు అన్నీ కూడా చాలా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా ఇప్పుడు జరుగుతుంది.

 

ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు హీరోలు తమిళ హీరోలను చూసి చాలా వరకు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. తమిళ హీరోలను చూసి కథ లో భిన్నత్వాన్ని కోరుకుని ఆ తర్వాత తమ పాత్రలను ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే విధంగా భిన్నంగా ఉండాలని అవసరం అయితే తమ గ్లామర్ ని పక్కన పెట్టి చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు దీని మీదే చర్చలు అన్ని కూడా. దర్శక నిర్మాతలకు ఇదే విషయాన్ని హీరోలు స్పష్టంగా చెప్తున్నట్టు సమాచారం. దర్శకులు కూడా ఇప్పుడు హీరోల పాత్రల మీద ప్రత్యేక దృష్టి పెట్టారని అని అంటున్నారు. 

 

మహేష్ బాబు కూడా అవసరం అయితే గ్లామర్ ని పక్కన పెట్టి చెయ్యాలి అని చూస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇప్పటికే తమా ఇమేజ్ ని పక్కన పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మరికొందరు హీరోలు కూడా అదే విధంగా కష్టాలు పడుతున్నారు అని అంటున్నారు. కథ భిన్నం గా ఉండటం తో పాటుగా తాము కూడా కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ఇందుకోసం కష్టపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: