2004లో యువసేన సినిమాతో హీరోగా పరిచయం అయిన శర్వానంద్‌, తరువాత గౌరీ, శంకర్ దాదా ఎం బీ బీ ఎస్, సంక్రాంతి సినిమాల లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. తరువాత మరోసారి వెన్నెల సినిమాలో లీడ్ రోల్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత కూడా హీరోగా చేస్తూనే సపోర్టింగ్ రోల్స్‌ లోనూ కనిపించాడు శర్వా. ఈ యంగ్ హీరో కెరీర్‌లో తొలి బ్రేక్ గమ్యం సినిమాతో వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో అల్లరి నరేష్‌తో పాటు మరో హీరోగా నటించాడు.

 

అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయిన శర్వానంద్‌ కెరీర్‌కు కావాల్సిన బూస్ట్ రాలేదు. ఇక శర్వానంద్‌ కు నటుడిగా బ్రేక్‌ ఇచ్చిన తొలి సినిమా ప్రస్థానం. దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో సాయి కుమార్ కీలక పాత్రలో నటించగా శర్వా హీరోగా నటించాడు. ఈ సినిమా శర్వా కెరీర్‌ నే కాదు ఇండస్ట్రీనే మలుపు తిప్పింది. ఈ సినిమాతో శర్వాలోని నటుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్‌, మాత్రమే చేసిన శర్వాకు ప్రస్థానం తరువాత పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వటం మొదలైంది.

 

సినిమా కమర్షియల్‌గా వర్క్ అవుట్ కాకపోయినా క్లాసిక్‌ గా పేరు తెచ్చుకుంది. అందుకే ఈ సినిమా ను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు కూడా ఆఫర్లు వచ్చాయి. అయితే చాలా ఏళ్ళ తరువాత ఇటీవలే ఈ సినిమా హిందీ రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవా కట్ట దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్‌ నటించాడు. అంతేకాదు ఈ సినిమాను స్వయంగా సంజయ్ దత్తే నిర్మించటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: