తెలుగు సత్తా చాటి చెప్పిన సినిమాలు  చాలానే  ఉన్నాయి..అలనాటి హీరోల సినిమాలు అంటే మరచి పోని తీపి గుర్తులు ..ఒక్కో సినిమా అంటే ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి..కుటుంబ విలువలను పెంపొందించేలా చూపించిన ఆ సినిమాలు ఇప్పటికి తెలుగు తెర పై వస్తే వదలకుండా చాలా మంది చూస్తున్నారు.. అది వాస్తవం..

 

 

 

మరో విషయమేంటంటే.. అలనాటి హీరోలను మళ్లీ తెర మీద గుర్తు చేయాలని చాలా మంది అనుకోని వారు సినిమాలు జీవిత విశేషాలు తలపించేలా వారి గురించి బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చిన ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇప్పుడు ఆ సినిమాలను మళ్లీ చూపించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.. 

 

 

 

 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ లు ట్రెండ్ నడుస్తోంది.. స్టార్ హీరోల తో ఈ సినిమాలను తెరకెక్కించాలని అభిప్రాయపడుతున్నారు.. అసలు విషయానికొస్తే.. నందమూరి నట సింహం బాల కృష్ణ  స్వర్గీయ నటుడు తెలుగు దేశం స్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్ లను తెరకెక్కించాడు.  అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల మన్ననలను అందుకోలేదు.. 

 

 

 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా మరో బయోపిక్ ను రూపొందించాలని ఆలోచనలో తెలుగు చిత్ర పరిశ్రమ అడుగులు వేస్తుంది.. అయితే ఆయన బయోపిక్ లో ఏ హీరో ను దించలనుకుంటుంది.. నందమూరి అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో మళ్ళీ ఆ ప్రయోగం చేస్తే తప్పక హిట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారట.. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తారా లేక ఇంకెవరైనా నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.. అన్నగారీ తేజస్సు ఉన్న అతనే ఈ సినిమాలో హీరో గా సెట్ అవుతాడని వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: