కేజీఎఫ్.. ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా ఏడాది దాటిన కూడా ఈ  సినిమా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు మరి. స్టోరీలో దమ్ముతో పాటుగా, హీరో యశ్ నటనతో ఆ సినిమా క్రేజ్ అమాంతం పెరిగింది అన్న విషయం వేరేలా చెప్పనక్కర్లేదు. 

 

 

 

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషలలో విడుదలై ఈ చిత్రంకు  విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్2ను చిత్ర యూనిట్ నిర్మిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

 

 

 

సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు 18 కోట్లకు దక్కించుకున్నారు.  ఓ కన్నడ చిత్రం డిజిటల్ హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడవడం అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆ సినిమాకి  ఇపుడు సీక్వెల్ రూపొందుతోంది. 'కేజీఎఫ్ 2' టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ .. రవీనా టాండన్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

 

 

 

 

ఫస్టు పార్టు సంచలన విజయాన్ని సాధించడం వలన .. రెండవ పార్టులో భారీ తారాగణం వలన డిజిటల్ రైట్స్ రేటు విషయంలో గట్టిపోటీ ఏర్పడిందట. అమెజాన్ ప్రైమ్ వారే అన్ని భాషలకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారట. ఎటు చూసినా ఈ సినిమా హిట్ పక్క అని తెలుస్తుంది.. మొదటి సినిమాను ఈ సినిమా బీట్ చేస్తుందని అంటున్నారు.. మరి ఏ మాత్రం హిట్ అందుకుంటుంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: