గత రెండు రోజుల క్రితం ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లోని మల్కాన్ గిరి పట్టణంలో ఎస్సై విధులను నిర్వర్తిస్తున్న శుభ శ్రీ నాయక్ తన కోసం తెచ్చుకున్న లంచ్ బాక్స్ లోని భోజనాన్ని అంగవైకల్యంతో మతిస్థిమితం కోల్పోయిన ఒక అనాధ మహిళకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఒక మనిషిని మరొక మనిషి తాకేందుకు భయపడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో శుభశ్రీ నాయక్ ఒక అభాగ్యురాలని చేరదీసి ఓ తల్లి తన బిడ్డకు అన్నం తినిపించినట్టు ఆమెకు తినిపించింది. అయితే ఈ వీడియోని చేసిన చిరంజీవి ఆ లేడీ ఎస్సై లో ఉన్న మానవత్వానికి, మాతృత్వానికి ఫిదా అయిపోయాడు. ఆమెతో మాట్లాడే తన స్పందన తెలియచేయాలనుకుంటున్నాడు. అనుకున్నట్టుగానే తనతో మాట్లాడి పోలీసులంటే కఠినమైన వారు కాదని వారి హృదయంలో ఎంతో కారుణ్యం ఉంటుందని దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఎస్సై శుభశ్రీ నాయక్ నిలుస్తుందని ఆయన అన్నాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణను చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేశాడు.


ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ... ' నమస్తే శుభశ్రీ నీ వీడియో ఒకటి రెండు రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోలో మీరు మానసిక వైకల్యం గల ఒక మహిళకు అన్నం తినిపిస్తున్నారు. ఆ సంఘటన నన్ను బాగా కదిలించింది. నా హృదయాన్ని నేరుగా తాకింది. మీ గొప్ప పనిని చూసిన క్షణం నుండి నీతో మాట్లాడాలని, నా కృతజ్ఞతాభావం నీకు తెలియజేసేందుకు నేను ఎంతో ట్రై చేస్తున్నాను. సాటి మహిళ కాక వేరొక మహిళ కు మీరు అన్నం తినిపించడం నన్ను బాగా సంతోషపెట్టింది. మీరు అంత గొప్పగా స్పందించడానికి కారణం ఏంటో అని తెలుసుకోవచ్చా?' అని చిరంజీవి ఆమెను ప్రశ్నించాడు.


బదులుగా ఎస్ఐ మాట్లాడుతూ... ' నేను ప్రత్యేకించి ఏ గొప్ప పని చేయలేదు, సార్. నేను డ్యూటీ నిమిత్తం ప్రయాణం చేస్తుండగా... నాకు ఆ మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళ కనిపించింది. తాను కనీసం తన చేతులతో అన్నం పట్టుకోలేకపోతుంది. మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆమె ఒక్క ముద్ద కూడా తినే పరిస్థితిలో లేదు. అందుకే ఆమెకు నేను తినిపించాను, సార్' అని ఆమె సమాధానమిచ్చింది.


దాంతో చిరంజీవి మళ్లీ మాట్లాడుతూ... నీలో నేను సానుభూతి కలిగిన ఒక గొప్ప అమ్మని చూశాను. మీరు చేసిన ఈ పని అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ కప్ప పని చేసినా మీకు తప్పకుండా నలుమూలల నుండి ప్రశంసలు దక్కే ఉంటాయి' అని ఆయన అన్నాడు. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ... అవును, సార్. ఒడిషా ముఖ్యమంత్రి తో సహా నాపై ఉన్నత అధికారులు, బంధుమిత్రులు, సహోద్యోగుల అందరూ నన్ను ఎంతో ప్రశంసించారు అని ఆమె చెప్పింది. మీరు కూడా నా గురించి మాట్లాడారని అని తెలిసి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మీ గురించి నాకు బాగా తెలుసు. కేవలం సినీ హీరో మాత్రమే కాదు మీరు సోషల్ వర్కర్ కూడా. సమాజం కోసం మీరు చేసిన ఎన్నో ఈ విషయాలను కూడా నేను తెలుసుకున్నాను సార్. మీ సినిమాలను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నీకు నేను పెద్ద అభిమానిని సార్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాను' అని ఆమె చెప్పుకొచ్చారు.


ఏదేమైనా కేవలం ఆ అనాధ మానసిక రోగికి మాత్రమే కాదు అనేకమంది ముసలివారికి, నిస్సహాయతతో జీవనం సాగిస్తున్న వృద్ధులకు మందులు వేస్తూ, ఆహారం అందిస్తూ అందరినీ తన సొంత మనుషుల చూసుకుంటుంది ఈ మహిళా ఎస్సై. ఎంతైనా ఇంత మాతృత్వాన్ని మానవత్వాన్ని కలిగి ఉన్న ఈ ఎస్ఐ గ్రేట్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: