సినిమా మాధ్యమం ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు సమాజం విలువ, బాధ్యత, దేశభక్తి.. వంటి అంశాల్ని కూడా అందివ్వగలదు. ఇందుకు ఎన్నో సినిమాలు అనేక భాషల్లో తెరకెక్కాయి. తెలుగులో కూడా అలాంటి సినిమాలకు కొదవ లేదు. ముఖ్యంగా దేశభక్తి చిత్రాలు కూడా ఎక్కువగానే వచ్చి ప్రజల్లో చైతన్యం, స్ఫూర్తి రగిలించాయి. ఇందులో గుణశేశర్ దర్శకత్వంలో వచ్చిన ‘మనోహరం’ సినిమా కూడా ఉంది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2000 మే13న ఈ సినిమా విడుదలైంది.

IHG

 

చిరంజీవితో చూడాలని ఉంది వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా మనోహరం. భారత్, పాక్ మధ్య జరిగే ఉగ్రవాద నేపథ్యంలో గుణశేఖర్ రాసుకున్న కథ ఇది. ఓ బ్యాంక్ ఎంప్లాయి అనుకోని పరిస్థితుల్లో ఉగ్రమూకల ఉచ్చులో చిక్కకుంటే.. భార్య ఎలా పోరాడి తన భర్తను కాపాడుకుంది అనే కాన్సెప్ట్ నేపథ్యంలో సినిమా తీశాడు గుణశేఖర్. జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫస్టాఫ్ లో సరదా సన్నివేశాలు, సెకండాఫ్ లో దేశభక్తి ప్రధానాంశంగా సాగుతుంది. గుణశేఖర్ టేకింగ్ కి తోడు పోసాని కృష్ణమురళి మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం అనే చెప్పాలి.

IHG

 

అప్పటికి మాస్ బీట్స్ ఇవ్వడంలో తిరుగులేకుండా దూసుకెళ్తున్న మణిశర్మ.. ఈ సినిమాలో అన్నీ క్లాస్ మెలోడీస్ ఇచ్చి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ప్రతి పాట వీనులవిందుగా ఉండి ఆడియో, వీడియో పరంగా హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఇందుకు వేటూరి సాహిత్యం ఎంతో దోహదపడింది. కమర్షియల్ గా యావరేజ్ అయినా మంచి దేశభక్తి సినిమాగా నిలిచిపోయింది. సుంకర మధు మురళి, ముళ్లపూడి బ్రహ్మానందం ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ తృతీయ సినిమాతో పాటు జగపతిబాబు, లయకు ఉత్తమ నటీనటులుగా నంది అవార్డులు వచ్చాయి.                                                                 

 IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: