తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఈ ఫ్యామిలి నుండి దాదాపు డజను మంది వరకు ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. వీరిలో నిహారిక కొణిదెల  ఒకరు. నాలుగైదు సినిమాల్లో నటించినప్పటికీ ఈ మెగా భామకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయినా ఈ అమ్మడి గురించిన వార్తలు రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆ పుకార్లన్నిటికి  చెక్ పెట్టారు.

 

ఆ మధ్య మెగా ఫ్యామిలి నుండి వచ్చిన సాయి ధరమ్  తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నిహారిక పెళ్లి అనే వార్తలు వినపడ్డాయి. అయితే వీటి గురించి నిహారిక స్పందించి ఆ వార్తలన్నీ నిజం కాదని తేల్చేసింది. ఇక ఇప్పుడు నాగబాబు ఆమె పెళ్లిపై వివరణ ఇచ్చారు. ఆమెకు సంబంధాలు చూస్తున్నామని వచ్చే ఏడాది ప్రారంభంలోనే నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పారు. తర్వాత వరుణ్ తేజ్ కి కూడా పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

 

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. అందరు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో నిహారిక పెళ్లిపై రోజుకొక వార్త వస్తుండటంతో  వాటన్నిటికి నాగబాబు చెక్ పెట్టె విధంగా క్లారిటీ ఇచ్చారు. ఇదలా ఉంచితే అసలు నాగబాబు పిల్లల్ని సినిమా రంగంలోకి తీసుకు వచ్చే ఆలోచనలో లేరట. వరుణ్ తేజ్ ని ఐపిఎస్ ఆఫీసర్ గా, నిహారికని డాక్టర్ గా చూడాలనుకున్నానని వెల్లడించారు. అయితే పిల్లల ఇష్టాలను కాదన లేక తన ఆలోచనలను విరమించుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే నిహారిక కెరీర్ లో సెటిల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళం లో ఒక సినిమాలో నిహారిక నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: