టాలీవుడ్ లో యువ దర్శకుల హవా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రతిభ ఉన్న యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి గానూ పలువురు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా యువ దర్శకుల ప్రతిభ ను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నారు. ప్రతిభ ఉంటే చాలు ప్రయోగం చేయడానికి అయినా సరే రెడీ అంటున్నారు. కథ బాగుంది అనుకుంటే చాలు అవకాశాలు ఇవ్వడానికి ఏ మాత్రం ఆలోచించే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో లేదు అనేది వాస్తవం. 

 

యువ దర్శకుల కోసం అగ్ర హీరోలు ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది అని అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి యువ దర్శకుల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తనతో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకుల్లో ఎక్కువగా యువకులు ఉన్నారు అని తెలుసుకున్న చిరంజీవి ఇప్పుడు యువ దర్శకులను పిలిచి కథలు రెడీ చేసుకోండి అని చెప్తున్నారు. ఇక తనతో గతంలో సినిమాలు చెయ్యాలి అనుకునే నిర్మాతలకు కూడా ఆయన అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ కి చిరంజీవి అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. 

 

హరీష్ శంకర్ ఎప్పటి నుంచో కథ రెడీ చేసుకుని రెడీ గా ఉన్నారని అంటున్నారు. దీని తో చిరంజీవి హరీష్ శంకర్ కి ఫోన్ చేసి కథను రెడీ చేసుకుని సిద్దంగా ఉండమని తన నుంచి ఎప్పుడు అయినా సరే ఫోన్ వస్తుంది అని చెప్పారట. దీనితో హరీష్ శంకర్ ఇప్పుడు కథను రెడీ చేసుకోవడం లో బిజీ గా ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది పూర్తి స్థాయిలో స్పష్టత లేదు గాని రెండేళ్ళల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: