తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని వారసుడిగా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున. ఆయన నటించిన సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి. కుటుంబ కథా చిత్రాలైన, ప్రేమ కథా చిత్రాలైనా, మరి ముఖ్యంగా భక్తి రస చిత్రాలలో నాగార్జున నటన అద్భుతం అనే చెప్పాలి. 1986 లో విక్రం సినిమాతో వెండితెర పైకి తొలి అడుగు వేసిన నాగార్జున ఇప్పటి వరకు దాదాపు 90 కి పైగా చిత్రాలలో నటించారు. 

 

నాగార్జున కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించక ముందే సుడి గుండాలు చిత్రం ద్వారా బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు. అయితే హీరోగా విక్రం సినిమాతో వెండి తెర పైకి వచ్చినా 1989 లో వచ్చిన శివ సినిమా  నాగార్జున కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. హాట్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చేసిందనే చెప్పాలి. అప్పట్లో శివ సినిమా చరిత్ర తిరగరాసింది. నాగార్జున సరసన అమల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇంకా నాగార్జున ఫ్రెండ్స్ గా శుభలేఖ సుధాకర్, చిన్న, విశ్వనాథ్ తదితరులు నటిస్తారు. 

 

ఈ సినిమాకు  విలన్ గా జెడి చక్రవర్తి, రఘువరన్ నటిస్తారు. టోటల్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ సినిమాగా ఫుల్ కమర్షియల్ సినిమా శివ. ఈ సినిమాలో అన్నిటికన్నా హైలైట్ నాగార్జున సైకిల్ చైన్ లాగి జెడి చక్రవర్తిని కొట్టడం. ఈ సీన్ వల్ల సినిమా కు మంచి క్రేజ్ వచ్చింది. అటు క్లాస్ ని, ఇటు మాస్ ని కూడా ఆకర్షించేదే నిజమైన కమర్షియల్ సినిమా. రియల్ లైఫ్ పాత్రలకి దగ్గరగా ఉంటూ అందరిని ఎంటర్టైన్ చేసిన ఫుల్ యాక్షన్ సినిమా “శివ” గా ప్రేక్షకుల హృదయాలలో నిలిచింది. వసూలు  పరంగా కూడా మంచి సక్సెస్ సాధించిన సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: