టాలీవుడ్ లో సమంతా కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఆమె అడుగు పెట్టి పదేళ్ళు దాటినా సరే ఆమె క్రేజ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే చెప్పాలి. ఇప్పటికి ఆమె తో సినిమా చేయడానికి అగ్ర దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆమె మాత్రం సినిమాల విషయంలో ఒకటికీ పది సార్లు ఆలోచన చేసి చేస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం చూడటం లేదని అవకాశాలను ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. 

 


ఇప్పుడు ఆమెకు అగ్ర హీరోలతో సినిమాలు చేసే ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు ఆమె వాటిని కాదని తానే నిర్మాతగా సినిమాలను చేసే ఆలోచనలో ఉందని సమాచారం. మన తెలుగులో బాగా పేరు తెచ్చుకున్న వారి జీవితాల ఆధారంగా ఆమె బయోపిక్ లను తీసుకుని వచ్చే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాల గురించి ఆమె ఇప్పటికే మామ నాగార్జున తో కూడా చర్చలు జరిపింది అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని చైతూ తో కలిసి ఇప్పుడు వారిని వెతికే పనిలో ఆమె ఉందని సమాచారం. 

 

త్వరలోనే ఆమె ఈ సినిమాలను స్క్రీన్ మీదకు తీసుకుని రావడం ఖాయమని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. చిన్న చిన్న సినిమాల విషయంలో ఇప్పుడు ప్రేక్షకులు చాలా వరకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దానిని ఇప్పుడు ఆమె వాడుకోవాలని భావిస్తూ సినిమాలను చెయ్యాలని చూస్తుంది. ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఆమె సినిమాలను చేసే ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. మరి ఎవరి సినిమా చేస్తుంది ఏ సినిమా చేస్తుంది అనే విష్యం తెలియదు త్వరలోనే స్పష్టత ఇస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: