ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... అన్నీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కోవిడ్ 19 అంటువ్యాధి కాబట్టి ప్రజలందరూ భౌతిక దూరం పాటించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోని భాగంగానే జనసంద్రం ఎక్కువగా ఉండే సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, క్రీడా మైదానాలు, పెళ్లి మండపాలు ఇంకా ఎన్నో మూసివేయబడ్డాయి. భారతదేశంలో గత 50 రోజుల్లోనే దాదాపు 90 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


విస్తుపోయే నిజమేమిటంటే... గత 50 రోజుల నుండే మన దేశంలోకి విదేశీ విమాన రాకపోకలు, దేశంలో ప్రజా రవాణా ఇతరత్రా జన సమూహాల కదలికలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేసింది. అయినా కూడా దేశం లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో చూడొచ్చు. ఈ పరిస్థితులలో అంతగా అవసరం లేని సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇస్తుందని అనుకోవడం పొరపాటే. అందుకే చాలా మంది సినీ నిర్మాతలు, హీరోలు షూటింగ్ పూర్తి చేసుకున్న తమ సినిమాలను OTT అనగా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లకు ఎంతోకొంత డబ్బులకు విక్రయించాలనే యోచనలో ఉన్నారు.


అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం సినిమా ఎప్పుడో జనవరి నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఏవో కొన్ని కారణాల వలన ఆ చిత్ర బృందం ఏప్రిల్ 2వ తారీఖున సినిమా విడుదల చేయాలని ముహూర్తం పెట్టుకుంది. కానీ అప్పటికే భారత దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేయబడ్డాయి. ఐతే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిశ్శబ్దం సినిమాని ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ లలో విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నాడు. నిజానికి 3 వారాల క్రితమే తన సినిమాని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదల చేయాలనుకున్నాడు కానీ హీరోయిన్ అనుష్క శెట్టి అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న అనుష్క శెట్టి నిర్మాత తీసుకున్న నిర్ణయమే సరైనదని భావించి నిశ్శబ్దం సినిమా మీరు అన్నట్లుగానే విడుదల చేయండి అని నిర్మాతకు మద్దతు తెలిపింది.


తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ... ప్రొడ్యూసర్ నిశ్శబ్దం సినిమా థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ లలో విడుదల చేయాలనే డెసిషన్ తీసుకున్నప్పటికీ... మీరు అతనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టకూడదు... ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఎవరు కూడా ఆ నిర్ణయం పై కామెంట్ చేయకూడదు' అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా... మాధవన్ అంజలి శాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: