కొన్ని రోజులక్రితం ‘గబ్బర్ సింగ్’ విడుదలై 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పవన్ అభిమానులు చేసిన సోషల్ మీడియా హడావిడికి దర్శకుడు హరీష్ శంకర్ కూడ తన మాటలను కలిపి హడావిడి చేయడంతో పవన్ అభిమానులు వచ్చే ఏడాది హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తీయబోతున్న మూవీ ‘గబ్బర్ సింగ్’ స్థాయిలో ఉండాలని పవన్ అభిమానులు ఆకాంక్షించారు. ఈ హడావిడి ముగిసి కొద్ది రోజులు కూడ అవ్వకుండానే పవన్ హరీష్ శంకర్సినిమా కథకు సంబంధించి వచ్చిన ఒక లీక్ పవన్ అభిమానులకు ఆశ్చర్యంతో పాటు అసహనాన్ని కూడ కలిగిస్తోంది.


ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం తయారు చేస్తున్న కథ గతంలో జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన కథ అని లీకులు వస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ తో ‘రామయ్య వస్తావయ్యా’ అనే సినిమా చేసే ముందే ఈకథను చెప్పినప్పుడు జూనియర్ ఆ కథను నచ్చలేదు అని చెప్పి ‘రామయ్యా వస్తావయ్యా’ కథను ఇష్టపడి చేసాడట.


అయితే ఆ మూవీ ఘోరపరాజయం చెందడంతో ఆ కథను వేరే హీరోలకు వినిపించే సాహసం హరీష్ శంకర్ చేయలేదని టాక్. అయితే ఇప్పుడు అదే కథను కొద్దిగా మార్పులు చేసి పవన్ మనస్తత్వానికి సరిపోయే విధంగా మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం వ్రాసిన కథను పవన్ కళ్యాణ్ కోసం వాడుతున్నాడు అంటూ గాసిప్పుల హడావిడి ఈ లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీలో మొదలైంది.

 

ఇప్పుడు ఈ లీకులు మీడియాకు లీక్ అవ్వడంతో పవన్ అభిమానులు టెన్షన్ పడుతూ జూనియర్ రిజక్ట్ చేసిన కథను పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు పవన్ తన రీ ఎంట్రీ సినిమాల దర్శకుల విషయంలో శ్రద్ధ పెట్టకుండా పెద్దగా అనుభవం లేని వేణు శ్రీరామ్ ను ఫైయిల్యూర్ బాటలో పయనిస్తున్న క్రిష్ ను నమ్ముకోవడమే ఒక సాహసం అనుకుంటే ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎప్పుడో తిరస్కరించిన కథ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సద్దుబాటు చేయడం ఏమిటి అంటూ పవన్ అభిమానులు ఆవేదన పడుతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: