తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా తారా స్థాయిలో ఇమేజ్ ని సంపాదించి అనతి కాలంలోనే అగ్ర హీరోల జాబితాలో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో ఉదయ కిరణ్. చిన్నతనం నుండి సినిమాలపై ఉన్న ఇష్టం తో చదువు పూర్తి అయిన వెంటనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో స్టార్ డం సంపాదించి అశేష అభిమానులను సంపాదించాడు. ఆయన తేజ డైరెక్షన్లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నిర్మించిన “చిత్రం” సినిమాతో వెండి తెరకు పరిచయమైయ్యారు. 

 

వెండి తెరపైకి వస్తూనే తన సత్తా చాటారు. 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో యువ హృదయాల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఈ సినిమాలో ఉదయ్ కి జోడిగా రీమాసేన్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య పండిన రొమాంటిక్ డ్రామా సినిమా విజయానికి ప్లస్ అయ్యింది. చిన్న సినిమాగా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. అంతే కాక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, అతని స్నేహితుఅల మధ్య కామెడి సీన్స్ అందరిని అలరించాయి.

 

 మొత్తంగా తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించాడు. చిత్రం తరవాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. దీనితో హ్యాట్రిక్ హీరోగా బిరుదు అందుకున్నాడు. నువ్వు నేను సినిమాకు గాను 2001 లో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు ఉదయ్. తర్వాత వరుస సినిమాలతో తెలుగు, తమిళ బాషలలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు అన్ని సినిమాల్లో రొమాంటిక్ హీరోగా కనిపించిన ఉదయ్ కిరణ్, శ్రీ రాం సినిమాతో యాక్షన్ హీరోగా తనని తాను నిరూపించుకోవాలని అనుకున్నాడు. కాని ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: