ఈనెలాఖరి వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ అనేక వ్యాపారాలకు మినహాయింపులు ప్రభుత్వాలు ఇచ్చాయి. అయితే సినిమాహాల్స్ సినిమా షూటింగ్ లు మాల్స్ పూనః ప్రారంభం పై ప్రభుత్వాలు ఎటువంటి ఆసక్తి కనపరచక పోవడంతో సినిమా హాల్స్ కనీసం మరో రెండు మూడు నెలల వరకు తిరిగిప్రారంభం అయ్యే ఆస్కారం కనిపించడంలేదు. 


ఇలాంటి పరిస్థితులలో అప్పటివరకు తమ సినిమాల విడుదలను ఆపు చేయలేని పరిస్థితులలో ఉన్న నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆప్షన్ రావడంతో ఎగ్జిబిటర్లకు షాక్ తగిలింది. హిందీలో అయితే స్టార్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజుకు సిద్ధం అవుతున్నాయి. దీనితో ఓటిటి లో డైరెక్ట్ రిలీజ్ కి వ్యతిరేకంగా అన్ని పెద్ద మల్టీప్లెక్స్ చైన్లు ఒకమాట మీదకి వచ్చి ఇలా ఓటీటీ లో డైరెక్ట్ రిలీజ్  చేస్తే తాము అంగీకరించం అంటూ హెచ్చరికలు ఇస్తున్నాయి.  


సౌత్ లో మల్టీ ప్లెక్సుల కంటే సింగిల్ స్క్రీన్ల వలన మెజారిటీ రెవెన్యూ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడ అనేక సింగిల్ థియేటర్స్ కొందరు ప్రముఖ వ్యక్తుల గుత్తాది పత్యంలో ఉన్నవిషయం ఓపెన్సీక్రెట్. దీనికితోడు అనేకమంది ప్రముఖ తెలుగు నిర్మాతలు ఈ ఓటీటీ రిలీజుకు వ్యతిరేకంగాలేరు. ఓటీటీ రిలీజుల కారణంగా థియేటర్లకు ఆదాయం తగ్గిపోతుందనేది వాస్తవమేఅయినా ప్రస్తుతానికి నిర్మాతలను రక్షించుకోవడానికి దీనికిమించిన మరో మార్గం లేదు అని అభిప్రాయ పడుతున్నారు. దీనితో మరింత రెచ్చిపోతున్న మల్టీ ప్లెక్స్ యజమానులు ఒటీటీ ద్వారా విడుదల అయ్యే సినిమాలను నిర్మించిన నిర్మాతల సినిమాలను అదేవిధంగా అలాంటి సినిమాలలో నటించిన హీరోల సినిమాలను భవిష్యత్ లో కరోనా పరిస్థితులు చక్కపడ్డాక కూడ తాము ప్రదర్శించం అంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. 


ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో అనేకమంది తెలుగు టాప్ హీరోల సినిమాల నిర్మాణం జరుగుతున్న పరిస్థితులలో తమ సినిమాలకు మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలు భవిష్యత్తులో అధిక సంఖ్యలో స్క్రీన్స్ ఇవ్వకపోతే కలక్షన్స్ కు సంబంధించిన రికార్డులు అందుకోవడం కష్టం. ఇప్పటికే తమ సినిమాలకు సంబంధించి ఓవర్సీస్ కలెక్షన్స్ ఈ కరోనా సమస్యల వల్ల మిస్ అవుతున్న హీరోలు ఇప్పడు ఈ ఓటిటి వల్ల రగులుతున్నమల్టీ ప్లెక్స్ సింగల్ థియేటర్స్ వార్ మరింత ముదిరితే కరోనా ఎఫెక్ట్ తో భవిష్యత్ లో తమ పారితోషికాలు తగ్గి అదేవిధంగా తమ సినిమాల కలెక్షన్స్ రికార్డులకు కూడ బ్రేక్ పడితే తమ పరిస్థితి ఏమిటి అంటూ హీరోలు అంతా ఈ లాక్ డౌన్ సమయంలో టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: