జూనియర్ ఎన్టీఅర్ పుట్టినరోజు ఎప్పుడు లేనివిధంగా అత్యంత సాదాసీదాగా జరుగుతోంది వాస్తవానికి ఈరోజు ‘ఆర్ ఆర్ ఆర్’ లోని జూనియర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కాని వీడియో కాని విడుదల అవుతుంది అని ఆశ పడ్డ జూనియర్ అభిమానుల ఆశల పై కరోనా దెబ్బ కొట్టడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఎటువంటి హడావిడి లేకుండా ఈరోజు జూనియర్ పుట్టినరోజు అత్యంత్ సాదాసీదాగా జరగడం అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


ఇదే సందర్భంలో జూనియర్ తన అభిమానులకు ఒక సందేశం ఇస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన రోజునే తనకు నిజమైన పండుగ అంటూ తన అభిమానులకు ధైర్యం చెపుతూ భౌతిక దూరం పాటిస్తూ తన అభిమానులను అందర్నీ కరోనా కాటుకు దూరంగా సురక్షితంగా ఉండండి అంటూ సందేశం ఇచ్చాడు. దీనితో అసలు ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు విడుదల అవుతుంది అన్నఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలోనే కాకుండా జూనియర్ అభిమానులలో కూడ ఆసక్తికర చర్చలకు తెర లేపింది.


ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ 2021 సంక్రాంతికి కూడా రావడం లేదు అన్నవిషయం క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు కనీసం 2021 సమ్మర్ కు అయినా ‘ఆర్ ఆర్ ఆర్’ వస్తుందా? అన్న సందేహాలకు కొన్ని కారణాలు బలం చేకూరుస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం అయినా అందరి డేట్స్ ఎడ్జెస్ట్ అయి సినిమా పూర్తి కావడానికి జూలై నాటికి కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ అన్న సరికొత్త గాసిప్పులు ఇప్పుడు హడావిడి చేస్తున్నాయి. దీనికికారణం ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి విదేశాల నుంచి టెక్నిషీయన్లు నటీనటులు అని అంటున్నారు.


వారంతా ఈకరోనా భయాలు పూర్తిగా తొలిగిపోతే కాని ఇండియా రారు అనీ అప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ పెండింగ్ వర్క్ కొనసాగుతూనే ఉంటుంది అని టాక్. దీనికితోడు ఈసినిమాకు అత్యంత భారీ గ్రాఫిక్స్ అవసరం అయిన నేపధ్యంలో ఈపనులు పూర్తి కావడానికి చాలసమయం పడుతుంది అని అంటున్నారు. ఎన్టీఆర్ లాస్ట్ సినిమా ‘అరవింద సమేత’ 2018 అక్టోబర్ లో వచ్చింది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ 2021 జూలైలో విడుదల అవుతుంది అని అనుకున్నా జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడు అని అనిపించడం సహజం. ‘ఆర్ ఆర్ ఆర్’ లో చిక్కుకోకుండా ఉండి ఉంటే ఈ పాటికి జూనియర్ కనీసం మూడు సినిమాలలో నటించి ఉండి ఉండేవాడు. జూనియర్ కు ఉన్న మార్కెట్ రీత్యా ఒక సినిమాకు 20 కోట్లు చొప్పున వేసుకున్న ఈపాటికి అతడికి 60 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అయినా రాజమౌళి పై ఉన్న నమ్మకంతో తారక్ తన మూడు సంవత్సరాల కాలాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం త్యాగం చేస్తున్నాడు. మరి ఈ త్యాగ ఫలితం ఏమిటీ అన్నది కనీసం వచ్చే సంవత్సరం పుట్టినరోజుకు కూడా తేలకుంటే ఒక విధంగా ‘ఆర్ ఆర్ అర’ ను నమ్ముకుని జూనియర్ చాప పెద్ద సాహసం చేసాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: