పవన్ మీడియా ముందుకు వచ్చే రోజు దగ్గర పడటంతో పవన్ ఇచ్చే స్పీచ్ లో ఎటువంటి అంశాలు ఉంటాయి అనే ఆతృతతో ఇప్పటికే రకరకాల విషయాలు బయటకు వచ్చాయి. ‘ప‌వ‌ర్ కోసం కాదు ప్రశ్నించ‌డానికే’ వ‌స్తున్నాను అనే స్లోగన్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అతడు పెట్టబోయే పార్టీ పేరు ‘జనసేన’ అంటూ ప్రస్తుతం రాష్ట్రంలోని మారుమూల పల్లెటూరుకి కూడా ఈ వార్తలు చేరిపోయాయి. అప్పుడే గ్రామాలలోని రచ్చ బండల పై పవన్ గొప్పా, బాలయ్య గొప్పా అనే రచ్చ బండ చర్చలు తీవ్ర స్థాయిలో జరిగి పోతున్నాయి. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు పవన్ రేపు మీడియా సమావేశంలో చెప్పబోయే స్లోగన్ కు ఒక కొత్త అర్ధాన్ని వెలికి తీస్తున్నారు.  ప‌వ‌న్ ఎత్తుకోబోతున్న పవర్ కోసం కాదు ప్రశ్నించడానికి కాన్సెప్ట్ బాగానే ఉన్నా, ఇది నారా వారి హీరో సినిమా నుంచి కాపీ కొట్టిందే అంటున్నారు తెలుగుదేశం వర్గాలు. నారా రోహిత్ హీరోగా చేసిన ‘ప్రతినిధి’ సినిమాలో అడ‌గ‌డానికే వ‌స్తున్నా అంటూ ఒక డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ ను పోలినట్లుగా పవన్ చెప్పబోయే పొలిటికల్ డైలాగ్స్ ఉండచ్చు అంటు సెటైర్లు వేస్తున్నాయి తెలుగుదేశం వర్గాలు నుంచి. నారా రోహిత్ నటించిన `ప్రతినిధి` సినిమాలో ప్రశ్నించ‌డ‌మే ప‌నిగా పెట్టుకొన్న ఓ సాధార‌ణ పౌరుడు పాత్ర పోషించాడు ఆ సినిమా టీజ‌ర్‌కీ, ట్రైల‌ర్స్‌కీ చ‌క్కటి స్పంద‌న లభించింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ వెనుక పొలిటికల్ డైలాగ్స్ రచయితగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఈ మాత్రం విషయాలు తెలియవు అనుకుంటే అవివేకమనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: