అనుష్క ‘భాగమతి’ తరువాత చాల గ్యాప్ తీసుకుని నటిస్తున్న ‘నిశ్శబ్దం’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సమ్మర్ రేస్ కు రావలసిన ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ తో ఆగిపోయింది. ఈమూవీ నిర్మాతలు ఈమూవీ పై చాల భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడంతో వారి డబ్బు అంతా బ్లాక్ అవ్వడంతో ఈమూవీని ఈ లాక్ డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ ఒటీటీ స్ట్రీమ్ ద్వారా విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలే జరిగాయి. అయితే ఈమూవీని ఒటీటీ ద్వారా విడుదల చేయడం అనుష్కకు ఇష్టం లేదు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి.


అయితే ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కు అమెజాన్ లో చెక్ పెట్టింది బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ అంటూ ఇప్పుడు మరొక ఆసక్తికర గాసిప్ వెలుగులోకి వచ్చింది. ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో దేశవ్యాప్తంగా ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖ నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో విడుదల చేయడానికి ఒటీటీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన ‘గులాబో సీతాబో’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్నట్లు వార్తలు రావడం అందరికీ షాక్ ఇచ్చింది.


వాస్తవానికి ఈమూవీ గతనెల 17న అత్యంత భారీస్థాయిలో దేశవ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో ఈమూవీ  స్ట్రీమింగ్ హక్కుల ఇవ్వడానికి మొదట్లో ఈ మూవీ నిర్మాతలు 70-75 కోట్లు డిమాండ్ చేశారు అని తెలుస్తోంది. అయితే కరోనా ఎఫెక్ట్ మొదలు కావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ 35 కోట్లకు బేరసారాలు ఆడి తన మాట నెగ్గించుకునేలా చేసుకుంది. ‘గులాబో సీతాబో’ బాటలో ఇప్పటివరకు దాదాపుగా డజన్ సినిమాలు డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి.


వాస్తవానికి ఈ లిస్టులో అనుష్క ‘నిశ్శబ్దం’ కూడ ఉంటుంది అని భావించారు. అయితే అమెజాన్ సంస్థ ‘నిశ్శబ్దం’ కు 20 కోట్లు మించి ఇవ్వలేమనీ జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్న అమితాబ్ మూవీకి తాము 35 కోట్లు ఇస్తుంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు 20 కోట్లకు మించి ఇక్కడ ఇస్తాము అన్నట్లు బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రజ్ లాంటి అనుభవం ఉన్న నిర్మాతలు కూడ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ప్రముఖ ఒటీటి సంస్థల బెరాలకు తట్టుకోలేక ధియేటర్ల పునఃప్రారంభం గురించి ఒపికగా ఎదురు చూస్తున్న పరిస్థితులలో ‘నిశ్శబ్దం’ మౌనం వహించవలసి వస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: