ఇచ్చిన మాట తప్పకూడదని సినిమా వాళ్లు మాత్రం.. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూనే.. తమ సినిమాలకు సంబందించి పనులన్నీ టైమ్ వేస్ట్ కాకుండా పెండింగ్ పడకుండా చేసేసుకుంటున్నారు . లాక్ డౌన్ ఉన్నా కూడా వర్క ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు హీరోలు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధకృష్ణ సినిమాకు సంబందించి ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ కూడా నటిస్తోంది. అది అక్కగానా అత్తగానా అన్నది మాత్రం డిస్ క్లోజ్ చేసి ఉంచారు జాన్ టీమ్. ఈ మద్యనే అన్నపూర్ణ స్టూడియోలో ప్రభాస్, భాగ్యశ్రీ పై కొన్ని సీన్స్ చేసింది యూనిట్.
ట్రిపుల్ సినిమాకి సంబందించి పనులుకూడా నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ టైమ్ ని రాజమౌళి అండ్ టీమ్ బాగా వాడుకుంటున్నారు . ఇప్పటికి 75 పర్సెంట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన సినిమాకు సంబందించి తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా జనవరి 8 న రిలీజ్ కాబోతోంది.
కొరటాల శివ- చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకి ఇప్పటి వరకూ తీసిన షూటింగ్ పార్ట్ కి చిరంజీవి డబ్బింగ్ కంప్లీట్ చేసేశారు . జనరల్ గా షూట్ కంప్లీట్ అయ్యేస్టేజ్ లో చేసే పనులన్నీ ఇప్పుడే చేసేసుకుంటున్నారు మెగాస్టార్. దీనితో పాటు ఇప్పటివరకూ షూటిగ్ పార్ట్ ఎడిటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యింది. మాస్ మహారాజా రవితేజ కూడా లాక్ డౌన్ టైమ్ ని యుటిలైజ్ చేసుకుంటున్నాడు. మలినేని గోపీచంద్ డైరెక్షన్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్న రవితేజ.. క్రాక్ సినిమాకు సంబందించి ఈ ఖాళీ టైమ్ లో డబ్బింగ్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్నాడు.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన నాని ప్రజెంట్ శివనిర్వాణ తో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాకు సంబందించి ఇంకా 60 పర్సెంట్ షూటింగ్ మిగిలి ఉండగానే టాక్ డౌన్ టైమ్ లో వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో మరో సినిమాకు సైన్ చేశాడు . ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా లాక్ డౌన్ టైమ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని స్పీడప్ చేసేశారు. దాదాపు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా 10 రోజుల షూటింగ్ తో మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీకి రెడీ అయినట్టే . ఇలా లాక్ డౌన్ టైమ్ ని కూడా యూజ్ చేసుకుంటూ రిలాక్స్ అవ్వకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు హీరోలు.