టాలీవుడ్.. బాలీవుడ్ దాటుకుని హాలీవుడ్ కు చేరింది స్టైలీష్ స్టార్ కున్న  ఫ్యాన్ ఫాలోయింగ్. బన్నీ డాన్స్ కు ఫిదా అవ్వడమే కాదు... అల్లు వారబ్బాయికి సెలబ్రెటీలు కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారు.  అల్లు అర్జున్ డాన్స్ కు టాలీవుడ్ ఫ్యాన్సే కాదు బాలీవుడ్ స్టార్స్  కూడా పడి చచ్చిపోతున్నారు.


 
బాలీవుడ్ సెలబ్రెటీలు బన్నీడాన్స్ కు.. పాటలకు ఫిదా అవుతున్నారు. బుట్టబొమ్మ సాంగ్‌ కి బాలీవుడ్ లో హీరోయిన్స్ శిల్పా శెట్టి, దిశా పటాని లాంటి స్టార్స్ ఫిదా అయ్యి టిక్‌ టాక్‌లో డ్యాన్స్ కూడా చేశారు. రీసెంట్ గా కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ కూడా బన్నీకి ఫ్యాన్ అయిపోయాడు. ట్విట్టర్ లో ఫ్యాన్స్ షాహిద్ కపూర్ ను ఒక్క మాటలో అర్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పండి అంటే.. షాహిద్ ఏమాత్రం ఆలొచించకుండా అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ అంటే ఇష్టం. ఐ లవ్ హిజ్ డాన్సింగ్ స్కిల్స్ అంటూ ఒక్క మాటలో ఆన్సర్ చేశాడు.

 

ఇంతకు ముందు కూడా బాలీవుడ్ స్టార్స్ చాలా మంది బన్నీ డాన్స్ కు ఫిదా అయ్యారు..డాన్సింగ్ హీరో హృతిక్ రోషన్ కూడా టాలీవుడ్ లో బన్నీ  డాన్స్ అంటే ఇష్టం అన్నారు. ఇంకా అనుపమ, టైగర్ ష్రాఫ్, ఆయూష్ శర్మ లాంటి బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం.. ఆయన డాన్స్ అంటే..చాలా ఇష్టం అని ఎప్పుడో  చెప్పేశారు. ఇప్పుడు బన్నీ ఇమేజ్  టాలీవుడ్, బాలీవుడ్‌నే దాటేసింది.

 

ఇంటర్నేషనల్‌గా బాగా ఫేమస్ అయ్యాడు స్టైలీష్ స్టార్... అదీ ఎంతలా అంటే.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన వైఫ్‌తో కలిసి బుట్ట బొమ్మ సాంగ్‌ తో పాటు రాములో రాములాకు కూడా కాలు కదిపాడు డేవిడ్ వార్నర్.టిక్ టాక్ లో అద్భుతంగా డాన్స్ చేసి .. అల్లు అర్జున్ నే సర్ ప్రైజ్ చేశాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి టిక్ టాక్ చేయడతో బన్నీతో పాటు ఆయన ప్యాన్స్ ఖషీ అయ్యారు.  ఇలా ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ తో తెగ హల్ చల్ చేస్తున్నాడు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: