షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ అయిపోతుందా..?  లాక్ డౌన్ అయ్యాక  ఎప్పుడు సినిమాలు రిలీజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు హీరోలు . అలా బాలీవుడ్ లో  దాదాపు 10 సినిమాలు లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.

 

ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చి ఫస్ట్ నుంచే ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా సూర్యవన్షి. రోహిత్ శెట్టి డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరోలు  అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, రణవీర్ సింగ్  మల్టీ స్టారర్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో కత్రినా కైఫ్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మార్చి  24 న రిలీజ్ కావల్సిన ఈ సినిమా కరోనా వల్ల  పోస్ట్ పోన్ అయ్యింది.  లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా..? సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు  తీసుకెళదామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మేకర్స్.

 

రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకొనే  జంటగా 1983 లో జరిగిన వరల్డ్ కప్ ఇన్సిండెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా 83.  కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ ఎమోషనల్ స్పోర్ట్ ఎంటర్ టైనర్   ఈ సంవత్సరం  ఏప్రిల్ 10 న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ తో పోస్ట్ పోన్ అయ్యింది. ప్రభుదేవా ,సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న మరో బ్లాక్ బస్టర్ భారీ మూవీ రాధే.  దిశాపఠానీ  హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో ద మోస్ట్ వాంటెడ్ భాయ్ గా సల్మాన్ మరో సారి తన ఫుల్ యాక్షన్ స్వింగ్ చూపించబోతున్నాడు. రణదీప్ హుడా విలన్ గా చేస్తున్న ఈ సినిమా  ఈ రంజాన్ కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ కరోనా తో పోస్ట్ పోన్ అయ్యింది.

 

బాలీవుడ్ యాక్షన్ హీరో  అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీ బాంబ్.  కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా లాక్ డౌన్ తో పోస్ట్ పోన్ అయ్యింది. ఈసినిమా మే 22 కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు . కానీ  లాక్ డౌన్ తర్వాతే ఈ ఎంటర్ టైన్ మెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చేది. అజయ్ దేవ్ గన్ లీడ్ రోల్ లో  భుజ్... దప్రైడ్  ఆఫ్ ఇండియా సినిమా తెరెక్కుతోంది. మిగ్ విమానాల బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమా కూడా లాక్ డౌన్ తర్వాతే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  పరినీతి చోప్రా,  అర్జున్ కపూర్ జంటగా   సందీప్ ఔర్ పింకీ ఫరార్ సినిమా వస్తోంది. ఇదా కూడా ఆఫ్టర్ లాక్ డౌన్ ఎంటర్ టైన్ మెంటే.

 

జాన్వీ కపూర్ చేస్తున్న రూహీ కీ అఫ్జా,  కియారా లీడ్ రోల్ లో వస్తున్న  ఇందూకీ జవానీ, కార్తీక్ ఆర్యన్ జంటగా వస్తున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ కి సీక్వెల్ భూల్ భులయ్యా 2,  పరేష్ రావల్ అండ్ కో చేసే హంగామా 2  ..ఈ సినిమాలన్నీ ,... లాక్ డౌన్ తర్వత ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి  అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: