టాలీవుడ్ లో చిరంజీవి గురించి తెలియని వారుండరు. ఆయన తన కెరీర్ లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటూ మెగాస్టార్ గా నిలదొక్కుకున్నారు. అయితే ఆయన కెరీర్లో కొన్ని సినిమాలు మాత్రం ఆయనకు యెనలేని గుర్తింపు తీసుకు వచ్చాయి.  అందులో కొంతమంది హీరోయిన్ లతో చిరంజీవి  కాంబినేషన్ లో ఎన్నో హిట్ లు వచ్చాయి. అలా చెప్పుకోదగ్గ ఫెయిర్స్ గా చిరంజీవి_ శ్రీదేవి, చిరంజీవి_ రాధిక,  చిరంజీవి_ రాధ.  వీరితో ఎన్నో హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే చిరంజీవి, శ్రీదేవి కాంబో లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 

 

చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో  వచ్చిన తొలి చిత్రం 1982లో బందిపోటు సింహం సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్ గా తెరకెక్కింది. ఎస్ పి  మధురమన్  డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మెగా స్టార్ తో సూపర్ స్టార్ రజని కాంత్ కుడా నటించారు. ఇక చిరంజీవికి జోడిగా అతిలోక సుందరి శ్రీదేవి నటించారు. పూర్ణ విశ్వనాథ్, నళిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఏం ఎస్ విశ్వనాథన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. బంది పోటుగా చిరంజీవి నటన ఈ సినిమాకు హైలెట్ అయ్యింది. రజినీ కాంత్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. అప్పట్లోనే ఇది ఒక మల్టీ స్టార్ గా అలరించింది. 

 

 మ్యూజికల్ గా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి, శ్రీదేవి ఫెయిర్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కట్టారు. అంతలా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చినా ఈ సినిమా మాత్రం ప్రత్యేకమైనదిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: