రొమాన్స్ అంటే కేవటం లిప్‌ లాక్‌, బెడ్ రూం సీన్స్‌ మాత్రమే కాదు. కళ్ల తోనే రొమాన్స్ పండించిన టాలీవుడ్ స్టార్ చాలా మంది ఉన్నారు. అలాంటి సినిమాలు కూడా మన టాలీవుడ్‌ లో చాలానే ఉన్నాయి. అలాంటి ఓ అద్భుతమైన చిత్రమే దేవదాసు. ఇండియన్‌ స్క్రీన్‌ మీద బెస్ట్ లవ్‌ స్టోరి గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఎవర్‌ గ్రీన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ గా నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా తో అక్కినేని నాగేశ్వర రావు ఇండియాస్‌ రొమాంటిక్‌ సూపర్‌ స్టార్‌ గా ఎదిగాడు.

 

ఈ సినిమాలో విషాదమే కాదు.. క్యూట్ రొమాంటిక్ సీన్స్‌ కూడా చాలానే ఉన్నాయి. బాల్యం లోనే పారు ప్రేమలో పడ్డ దేవదాసు, వారిద్దరు కలుసకోవటం, సరదా గా అల్లరి చేయటం, ఒకరి నొకరు ఆటపట్టించుకోవటం లాంటి సీన్స్‌ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. సినిమా సక్సెస్‌ లో ఆ సన్నివేశాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఆ సన్నివేశాల్లో ఏఎన్నార్, సావిత్రి నటన ఎంతో మంది కి ఇన్సిపిరేషన్‌ కలిగించింది. అందుకే దేవదాస్ చిరస్మరణీయ ప్రేమ కథగా చరిత్ర లో నిలిచి పోయింది.

 

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీఎల్‌ నారాయణ నిర్మించాడు. ప్రముఖ బెంగాళీ రచయిత శరత్‌ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన నవల ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమా ను తెలుగు తో పాటు దాదాపు భారతీయ భాషలన్నింటిలో రూపొందించారు. అయితే ఎన్ని వర్షన్ లు వచ్చిన అక్కినేని చేసిన స్థాయిలో దేవదాసు పాత్రను ఎవరూ పండించలేకపోయారని ఆ భాష ల్లో నటించిన నటులే ఒప్పుకున్నారు. ఈ సినిమా 1953 జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: