7జి బృందావన కాలనీ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ సెల్వరాఘవన్ కాదల్ కొండేన్ అనే తమిళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించి అందరి చేత వావ్ అనిపించాడు. 2003లో విడుదలైన ఈ చిత్రంలో ధనుష్ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్ గా, సుదీప్ సోనియా ప్రియుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రం తమిళంలో బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలవడంతో... తెలుగు, కన్నడ, మలయాళం,బెంగాలీ భాషలలో ఇతర శీర్షికలతో కాదల్ కొండేన్ సినిమాకి రీమేకులు రూపొందించగా... అవి కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. మన తెలుగులో విడుదలైన నేను సినిమాలో అల్లరి నరేష్, అర్చన శాస్త్రి(వేద), అభిషేక్ ప్రధాన పాత్రలలో నటించగా.. డైరెక్టర్ ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించాడు. 


ఈ చిత్రం యొక్క కథ గురించి క్లుప్తంగా తెలుసుకుంటే... వినోద్(అల్లరి నరేష్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అనాధ గా మారతాడు. అయితే అనాధ పిల్లలందరికి ఆశ్రమం కల్పించి ఆహారం అందించే ఓ చర్చి ఫాదర్ వినోద్ ని పెంచి పెద్ద చేస్తాడు. వినోద్ చిన్నప్పటి నుండే చాలా తెలివికలవాడు. ఎంత కష్టమైన లెక్కలను అయిన ఇట్టే పరిష్కరించే వాడు. కానీ తన చిన్నతనంలో ఎన్నో కఠినమైన అనుభవాలను చవి చూసిన అతను చాలా మూడీగా ఉంటూ భయం భయం గా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అయితే తాను చదువులో చురుకైనవాడు కాబట్టి... చర్చి ఫాదర్ అతడిని బలవంతంగా కాలేజీకి పంపిస్తాడు. అయితే తన జీవితాంతం అనాధాశ్రమంలో పెరిగి పెద్దయిన వినోద్ ఒకేసారి సిటీ కాలేజీలో అడుగు పెట్టే సరికి... తనకి ఆ ప్రపంచం అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే తాను మాసిపోయిన బట్టలను, అరిగిపోయిన పది రూపాయల చెప్పులను, చెడు వాసన వచ్చే లంచ్ బాక్స్ కాలేజీకి తీసుకురావడంతో... సిటీలో పెరిగి పెద్దయిన తన తోటి క్లాస్మేట్స్ అతడిని ఓ చీడపురుగుల చూస్తుంటారు. 


ఒక రోజు తాను క్లాస్ జరుగుతున్నప్పుడు నిద్రపోతుండగా... మ్యాథ్స్ లెక్చరర్ అతని మొహానికి డస్టర్ విసిరికొట్టి... క్లాస్ జరుగుతుంటే నిద్రపోతున్నావ్ ఏంటోయ్ అని తిట్టిపోస్తే... అతడు బోర్డు వద్దకు వచ్చి లెక్చరర్ చెప్తున్న గణితలెక్క పూర్తిచేసి అందరికీ పెద్ద షాక్ ఇస్తాడు. ఈ క్రమంలోనే దివ్య అతడిని పై ఆసక్తి పెంచుకుంటుంది. అందరూ అతడిని అసహ్యించుకుంటుంటే దివ్య మాత్రం అతని దగ్గర కూర్చొని లెక్కలు చెప్పించుకుంటుంది. క్రమక్రమంగా దివ్య వినోద్ కి మంచి బట్టలు కొనివ్వడం, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం లాంటివి చేసేది. అప్పటివరకు ఒక ఆడదాని ప్రేమ, ఆప్యాయతల కి నోచుకోని వినోద్ ఆ ప్రేమ ఆప్యాయతలు తనతోనే ఉండిపోవాలని దివ్య పై ప్రేమ పెంచుకొని ఆమె తన సొంతం కావాలనుకుంటాడు. కానీ దివ్య మాత్రం తన క్లాస్మేట్ అయిన ఆదిని ఘాడంగా ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరు వినోద్ ముందే రొమాన్స్, సెక్స్ చేసుకుంటూ ఉంటారు. తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరితో శారీరకంగా కలవడం అతనిని బాగా వేధిస్తుంది.

 

ఇవన్నీ తట్టుకోలేక తను కూడా దివ్య తో శృంగారం లో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు ఆదితో కలిసి వెళ్లిపోవాలి అనుకున్న దివ్య వినోద్ సాయం కోరగా... అతడు అదే అదనుగా భావించి దివ్యని తనతోపాటు ఎవరికీ కనిపించని ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఇక్కడ చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు చాలా శృంగార భరితంగా ఉంటాయి. చివరికి ఈ విషయం ఆదికి తెలియడంతో వినోద్ తో పోట్లాటకు దిగుతాడు. ఈ పోట్లాటలో వినోద్ మరణిస్తాడు. అయితే ఈ సినిమా మొత్తంలో ఎన్నో అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు చాలా సహజంగా చూపించబడ్డాయి. అల్లరి నరేష్ యాక్షన్ కి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఈ స్టోరీ రాసిన సెల్వరాఘవన్ వినోద్ అనే మనిషే ఉంటే అతడు నిజంగా ఎంత బాధ పడతాడు అనేది సూపర్ గా చూపించే దక్షిణ భారత దేశ వ్యాప్తంగా కోట్లమంది ప్రజలను ఫిదా చేసేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: