మలయాళ ఇండస్ట్రీ లో తిరుగులోనే ఫాలోయింగ్ సంపాదించుకున్న టాప్‌ హీరోయిన్‌ షకీలా. రొమాంటిక్ మూవీస్‌ తో పాపులర్ అయిన ఈ భామ ఓ రేంజ్ ‌లో సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో నటించింది. రొమాంటిక్ సీన్స్ ‌లో రెచ్చిపోయి నటించే షకీలా సినిమా అంటే అప్పట్లో కుర్రాళ్లు పడి చచ్చిపోయేవాళ్లు. అందుకే షకీలా సినిమాలకు భాషా బేధం లేకుండా అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యేవి. కేవలం ఇండియాలోనే కాదు నేపాల్ లాంటి ప్రాంతాల్లోనూ షకీలా సినిమాలకు భారీ క్రేజ్‌ ఉండేది.

 

అంతేకాదు అప్పట్లో షకీల సినిమా రిలీజ్ అవుతుందటే అప్పటి మలయాళ సూపర్‌ స్టార్‌ లు మోహన్‌లాల్‌, మమ్ముట్టి లాంటి వారు కూడా వణికిపోయేవారట. ప్రతీ వారం షకీలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి డేట్స్‌ దొరక్క ఇబ్బంది పడేవారట. ఆ రేంజ్‌ లో రచ్చ చేసింది షకీలా. ఇండియన్‌ స్క్రీన్‌ మీద తొలి సాఫ్ట్ పోర్న్ స్టార్ ‌గా పేరు తెచ్చుకుంది షకీలా. అంతేకాదు ఆ రంగంలో అత్యథిక పారితోషికం అందుకున్న స్టార్ ‌గా కూడా షకీలా రికార్డ్ సృష్టించింది. అయితే తరువాత ఆ ఫాం కోల్పోయింది షకీలా.

 

ఒకప్పుడు ఇండియన్‌ స్క్రీన్‌ మీద బిగ్గెస్ట్ రొమాంటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న షకీలా ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. షకీలా నాట్‌ ఏ పోర్న్‌ స్టార్ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా షకీల పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న షకీలా దర్శకురాలిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తాను డైరెక్ట్ చేసిన సినిమాను కూడా తనదైన స్టైల్‌లోనూ రొమాంటిక్‌ జానర్‌లోనే రూపొందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: