నేడు టెక్నాలజీతో అద్భుతాలు క్రియేట్ జ‌రుగుతున్నాయి. మ‌నిషి జీవనంలో వేగ‌వంతంగా మార్పులు జ‌రుగుతున్నాయి. తాజాగా.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెయ్యి హై డెఫినిషన్‌(హెచ్‌డీ) సినిమాలని సెకను కన్నా తక్కువ సమయంలోనే డౌన్‌ లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఇది న‌మ్మ‌డం క‌ష్టంగానే ఉన్నా.. న‌మ్మి తీరాల్సిందే మ‌రి.. ఇంత‌టి సాకేంతిక యుగంలో ఏ వింతైనా సాధ్య‌మేన‌ని శాస్త్ర‌వేత్త‌లు మ‌రోసారి నిరూపించారు. ఈ టెక్నాల‌జీ భవిష్యత్‌ తరాలకి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు చెప్పుకొచ్చారు.

 

ఆప్టిక‌ల్ చిప్‌ని ఉప‌యోగించి ఈ ఘ‌న‌త‌ని సాధించిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతుండగా,  సెకనుకు 44.2 టెరాబైట్ల (44.2 TBPS) వేగాన్ని అందుకున్నామని మొనాష్, స్విన్ బర్న్, ఆర్ఎంఐటీ నిపుణుల బృందం వెల్లడించింది. ఆస్ట్రేలియా నేషనల్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ ఉపయోగించే నెట్ వర్క్ సదుపాయాల్లో ఈ మైక్రో కోంబ్‌ను అమర్చి పరీక్షించగా, ఒక ఆఫ్టికల్ చిప్ ఇప్పటి వరకు చేయలేనంత..డేటాను ఉత్పత్తి చేయగలిగి ప్ర‌పంచాన్ని అబ్బుర‌ప‌ర్చారు. టెలికాం హార్డ్‌వేర్ క‌న్నా మైక్రోబాంబ్ చాలా చిన్న‌ది. ఇది ఇంద్ర‌ధ‌నస్సులా  వందలాది, నాణ్యమైన అదృశ్య పరారుణ లేజర్లని వెదజల్లుతుందట‌. ఒక్కో లేజర్‌ని ప్రత్యేక కమ్యునికేషన్‌ మార్గంగా ఉపయోగించుకోవచ్చు.

 

 బ్రాండ్ బిడ్త్ సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని మొనాష్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సిస్టమ్స్ ప్రొఫెసర్ బిల్ కోర్కోరన్ తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది ఇళ్ల‌ నుండే ప‌ని చేయ‌డం, సామాజిక సంబంధాలు, వీడియో స్ట్రీమింగ్ కోసం ఇంట‌ర్నెట్‌ని ఫుల్‌గా వినియోగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల‌లోనూ ఇంట‌ర్నెట్‌ వినియోగం ఎక్కువైంది. రానున్న రోజుల‌లో కూడా దీనిని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌, ర‌వాణా స‌దుపాయాల‌తో పాటు  ప్రపంచంలో అన్ని అవ‌స‌రాల‌కి  సరిపడేలా..బ్రాండ్ విడ్త్ లను అందించే శక్తి మైక్రో కోంబ్లకు ఉందని అంటున్నారు కోర్కోరన్. ముందుముందు టెక్నాల‌జీ ఇంకెన్న అద్భుతాల‌ను సృష్టిస్తుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: