బాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్, హీరోయిన్ కాంబో కరణ్ జోహార్, కాజోల్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, హీరోయిన్ కాంబో కరణ్ జోహార్, కాజోల్ లది. ముఖ్యంగా షారూఖ్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్లుగా కరణ్ తెరకెక్కించిన సినిమాలన్నీ ఇండియన్ స్క్రీన్ మీద క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఈ కాంబినేషన్ గురించి కరణ్ జోహార్ తన బయోగ్రఫి ఎన్ అన్ స్యూటబుల్ బాయ్ లో వివరించాడు.
కరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లోనే కాజోల్ తో కలిసి పనిచేశాడు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు కరణ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు, ఆ సమయంలో ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిన కరణ్‌కు కాజోల్ చాలా హెల్ప్ చేసిందట. అందుకే తాను డైరెక్టర్ అయ్యాక కూడా కరణ్, కాజోల్తోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపించాడు. డీ డీ ఎల్ జే తరువాత దర్శకుడిగా మారిన కరణ్ జోహార్ తన తొలి సినిమాకు హీరోయిన్ కాజోల్‌ను ఎంచుకున్నాడు. కుచ్ కుచ్ హోతా హై తొ కరణ్ జోహార్, కాజోల్ ల కాంబినేషన్ సూపర్ హిట్ అని ప్రూవ్ అయ్యింది.
అయితే అజయ్ దేవగన్‌తో వివాహం తరువాత సినిమాకలు గుడ్ బై చెప్పిన కాజోల్ చాలా కాలం పాటు వెండితెర మీద కనిపించలేదు. అయితే అదే సమయంలో అజయ్, కరణ్ జోహార్ మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా కాజోల్ కూడా కరణ్ కు దూరమైంది. ముఖ్యంగా ఓ సినిమా విషయంలో అజయ్, కరణ్ లమధ్ వివాదం తారా స్థాయికి చేరింది. అజయ్ సినిమాకు తక్కువ రేటింగ్ ఇవ్వాలని కరణ్ రివ్యూవర్లకు డబ్బు ఇచ్చినట్టుగా వార్తలు రావటంతో వివాదం పెద్దదైంది. అయితే ఈ విషయంలో కరణ్ తనకు సంబంధం లేదని చెప్పిన చాలా కాలం పాటు వివాదం కొనసాగింది. అయితే ఆ తరువాత జరిగిన ఓ బర్త్ బే పార్టీలో కలిసిన కరణ్, కాజోల్‌లు గొడవలను పక్కన పెట్టి తిరిగి కలిసిపోయారు.