టాలీవుడ్ లో సమంతాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోకి అడుగు పెట్టి 10 ఏళ్ళు దాటినా సరే ఆమె కు ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని కుర్రోడు నాగ చైతన్యను ఆమె పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె హీరోయిన్ ఆఫర్లు వస్తున్నాయంటేనే సమంతకు ఇక్కడ ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేయకపోయినా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎక్కువగా చేస్తుంది అనేది వాస్తవం. ఇక ఆమె సినిమాలు ఈ మధ్య ఎక్కువగా రాకపోవడంతో సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని అన్నారు.
ఇక ఇప్పుడు ఆమె నిజంగానే సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఆమె సినిమాలకు క్రేజ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు నాగ చైతన్య దృష్టి పిల్లల మీద ఎక్కువగా ఉందని ... ఆమె సినిమాలకు దూరం జరిగి పిల్లల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజమా కాదా అనేది తెలియదు గాని ఆఫర్లు వచ్చినా సరే వద్దని చెప్పినట్టు టాక్.
ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి తప్పుకుంటే గనుక రెండు సినిమాలు చేసి తప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఇప్పటికే రెండు సినిమాల్లో నటించేందుకు అడ్వాన్స్ కూడా తీసుకుంది. ఈ సినిమాలకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా కంప్లీట్ అయ్యాయాని సమాచారం. ఇందులో ఒకటి టాలీవుడ్ అగ్ర నిర్మాత బ్యానర్లో సినిమా చేసేందుకు ఆమె ఒప్పుకుందని అంటున్నారు. అందుకే ఆ సినిమాలు చేసి ఆమె తప్పుకునే అవకాశం ఉందని... చైతు కూడా ఇదే విషయాన్ని ఆమెకు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనా పెళ్లి లైఫ్ ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తోన్న సమంత ఇకపై తల్లి అయ్యి కుటుంబ బాధ్యతల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.