టాలీవుడ్ మాస్‌ యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిన దర్శకుడు వి వి వినాయక్‌. స్టార్ హీరో లతో యాక్షన్‌ ఫార్ములా సినిమాలను తెరకెక్కించిన వినాయక్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ హిట్స్ అందుకున్నాడు. అయితే ఈ లిస్ట్‌ లో వినాయక్‌ రూపొందించిన మూడు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించింది నయనతార. ముందుగా వెంకటేష్‌ హీరోగా వినాయక్‌ తెరకెక్కించిన ఫ్యామీలి యాక్షన్‌ డ్రామా లక్ష్మీ సినిమాలో నయనతార హీరోయిన్‌ గా నటించింది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ సక్సెస్‌ కావటంతో నయనతార కాంబినేషన్‌ ను మళ్లీ రిపీట్ చేశాడు నయన్‌.

 

లక్ష్మీ తరువాత నయనతార తో మరోసారి యోగి సినిమా చేశాడు వినాయక్‌. తమిళ సూపర్‌ హిట్ కు రీమేక్‌ గా తెరకెక్కిన ఈ సినిమా లో ప్రభాస్ హీరోగా నటించాడు. ఊర మాస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా రుచించలేదు. దీంతో యోగి డిజాస్టర్‌ అయ్యింది. అయితే యోగి సినిమా ఫ్లాప్‌ అయినా v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ మాత్రం నయనతారను లక్కీ గర్ల్‌ గానే ఫీల్ అయ్యాడు. అందుకే మరోసారి అదే హీరోయిన్‌ తో సినిమా చేశాడు.

 

వినాయక్‌, నయనతార్ కాంబినేషన్‌ లో వచ్చిన మరో సినిమా అదుర్స్‌. ఎన్టీఆర్ ద్విపాత్రాబినయం చేసిన ఈ సినిమాలో నయనతార ఓ హీరోయిన్‌ గా నటించింది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్ చూపించి ఆకట్టుకుంది నయనతార. ఈ  సినిమా సూపర్ హిట్ కావటంతో మరోసారి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్, నయనతార లది సూపర్‌ హిట్ కాంబినేషన్‌ అని ప్రూవ్‌ అయ్యింది. తొలి సినిమాలో నయనతారను హోమ్లీ గా చూపించిన వినాయర్‌ తరువాత అదుర్స్‌ లో మాత్రం అల్ట్రా స్టైలిష్‌ గా చూపించాడు. ఆ తరువాత v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఎక్కువగా యంగ్ జనరేషన్‌ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తుండటంతో నయనతార ను హీరోయిన్‌గా రిపీట్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: