సైరా తరువాత
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. అపజయమే లేకుండా వరస బ్లాక్ బాస్టర్ హిట్ల తో దూసుకుపోతున్న
డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడం తో ఆచార్య పై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ సినిమాలో
బిగ్ బాస్ 3
బ్యూటీ హిమజ కూడా ఓ పాత్రలో నటిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించింది. ఇంతకుముందు హిమజ
శతమానం భవతి ,వున్నది ఒకటే జిందగి ,
చిత్రలహరి తదితర చిత్రాల్లో నటించింది.
ఇక ఆచార్య విషయానికి వస్తే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ తో రానున్న ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా కాజల్ కనిపించనుంది. వీరితోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో మెరువనున్నాడు. ఇప్పటివరకు 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.
ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్ టైమెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈఏడాది చివర్లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ చిత్రం తరువాత చిరు లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కు స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. అన్ని కుదిరితే ఈఏడాది చివర్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. ఇవే గాక చిరంజీవి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అందులో భాగంగా చిరు ,మెహర్ రమేష్ తో అలాగే వెంకిమామ ఫేమ్ బాబీ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడు.