ప్రస్తుతం దక్షిణాది సినిమాల వైపు బాలీవుడ్ చూపు ఎక్కువగా ఉంటోంది. ఆస్థాయిలో మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అందరి అటెన్షన్ కు కారణమైన సినిమాల్లో మళయాళంలో వచ్చిన ‘అయ్పప్పనుం కోషియం’ అనే సినిమా. బిజు మీనన్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాపై తెలుగులోనూ చర్చ జరుగుతోంది. ఇప్పుడు మనకంటే బాలీవుడ్ ఈ సినిమాపై ఇంకా స్పీడ్ గా ఉంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి హిందీ రైట్స్ అమ్ముడైపోయాయి.

 

 

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహమ్ ఈ సినిమా రైట్స్ తీసుకున్నాడు. మళయాళంలో ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. కథ, కథనం ఎంతో ఉత్కంఠగా కొనసాగి మళయాళీలను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇద్దరి మధ్య జరిగే ఇగో సమస్యలతో ఈ సినిమా థీమ్ ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. దీంతో ఈ సినిమాపై జాన్ అబ్రహమ్ దృష్టి పెట్టాడు. సినిమా నచ్చడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

 

 

భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే ముద్ర చెరిపేసింది బాహుబలి. బాలీవుడ్ సెలబ్రిటీల ఆలోచనలు మార్చేసింది ఆ సినిమా. తెలుగు అనే కాదు.. సౌత్ ఇండియన్ మూవీస్ పై బాలీవుడ్ మేకర్స్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాను కూడా హిందీలో జాన్ అబ్రహమ్ చేసిన సంగతి తెలిసిందే. మరి అయ్యపుణం కోషియం హిందీలో ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: