లాక్ డౌన్ వల్ల గత రెండు నెలల నుండి సినిమా ,సీరియళ్ల షూటింగ్ లు వాయిదాపడ్డాయి అయితే  జూన్ నుండి  నిబంధనలు పాటిస్తూ కొద్దీ మందితో షూటింగ్ ను జరుపుకోవడానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతి త్వరలో షూటింగ్ లు ఎలా జరుపుకోవాలనే విషయంలో మార్గ దర్శకాలు జారీ కానున్నాయి. ఇక జూన్ నుండి షూటింగ్ లు స్టార్ట్ అయినా చాలా సినిమాలు వెంటనే  సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించండం లేదు అందులో మరీ ముఖ్యంగా అవుట్ డోర్ షూటింగ్ లు అయితే ఇప్పట్లో లేనట్లే.. 
 
కేవలం ఇండోర్ షూటింగ్ లు మాత్రమే చేసుకోవడానికి వీలుంటుంది. కరోనా ప్రభావం తో వేరే రాష్ట్రాల్లో  షూటింగ్ లు ఇప్పట్లో సాధ్యం కావు. ఇదిలావుంటే నాని నటిస్తున్న టక్ జగదీష్ షూటింగ్ కు మాత్రం పెద్ద అడ్డంకులు ఏమీలేవట ఎందుకంటే లాక్ డౌన్ స్టార్ అయ్యే ముందే ఈసినిమా షూటింగ్ ప్రారంభం కాగా రాజమండ్రి లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు ఇక మిగిలింది అంతా ఇండోర్ షూటింగే అది కూడా హైదరాబాద్ లో ఏదో ఒక స్టూడియో లో షూట్ చేస్తే సరిపోతుందట. సో ఈసినిమా షూటింగ్ ఈజీ గానే పూర్తి కానుంది. 
 
నిన్నుకోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా జగపతి బాబు ,నాని అన్నయ్య గా కనిపించనున్నాడు. షైన్ స్క్రిన్స్ పతాకం సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈసినిమా తరువాత నాని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో 'శ్యామ్ సింగ రాయ్' నటించనున్నాడు.కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈఏడాది చివర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: