ప్ర‌స్తుతం టాలీవుడ్ లో లాక్ డౌన్ న‌డుస్తున్నా కూడా పెళ్లిళ్ల హంగామా న‌డుస్తోంది. ఓ వైపు లాక్ డౌన్ ఉన్నా కూడా ఇప్ప‌టికే నిఖిల్ పెళ్లి చేసేసుకున్నాడు. మ‌రో వైపు నితిన్ పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ద‌గ్గుపాటి వారి వంశాంకురం రానా పెళ్లి పెద్ద హైలెట్ అవుతోంది. రానా ప్రియురాలు మిహీకా బ‌జాబ్ ను త్వ‌ర‌లోనే పెళ్లాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి తర్వాత రానా హైదరాబాద్ లో ఉండే అవకాశం లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అతను పెళ్లి తర్వాత హైదరాబాద్ లో కాదని ముంబై లో ఉంటాడని అంటున్నారు.  



వివరాల్లోకి వెళితే రానా ప్రస్తుతం పెళ్లి హడావుడి లో ఉన్నారు.  ఇటీవల అతని నిశ్చితార్ధం కూడా సైలెంట్ గా జరిగిపోయింది. దీనికి ఎవరిని పిలిచారో ఎవరిని పిలవలేదో తెలియదు గాని హడావుడిగా చేసుకున్నారు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకుని ముంబై వెళ్ళే అవకాశం ఉందని అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి అతను ఇప్పటికే ముంబై లో జుహూ ప్రాంతంలో ఒక ఫ్లాట్ కూడా దాదాపు రు. 40 కోట్ల ఖర్చు పెట్టి కొన్నాడు అని తెలుస్తుంది..



అతను అక్కడికి వెళ్లి బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తాడు అని బాలీవుడ్ లో ఉన్న తన పరిచయాలను స్నేహాలను అతను ఈ విధంగా వాడుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రానా ఇప్ప‌టికే హిందీ సినిమాలు కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. కాబోయే భార్య కు ముంబై లో వ్యాపారాలు ఉన్నాయని అందుకే అక్కడ ఉండాలని అనుకుంటున్నాడు అని కూడా ప్రచారం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్లి చేసేది ఏంటీ అనేది చూడాలి. అతను ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ దెబ్బకు పూర్తిగా ఆగిపోయాయి. వచ్చే ఏడాది ఈ రెండింటిని విడుదల చేస్తారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: