కరోనా పుణ్యమాని థియేటర్లలో విడుదలకావల్సిన సినిమాలు ఓటిటి ల్లో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో ఇప్పట్లో  థియేటర్లు  తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు దాంతో నిర్మాతలు ఓటిటి లను ఆశ్రయిస్తున్నారు. మంచి డీల్ కుదిరితే వెంటనే అమ్మేస్తున్నారు అందులో భాగంగా కోలీవుడ్  మూవీ పోన్మగళ్ వందాల్ థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలైయింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. నిజానికి రేపు ఈసినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా ప్రైమ్ మాత్రం కొంచెం ముందుగానే (ఈరోజు) అందుబాటులోకి తీసుకొచ్చింది.
 
తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్నిఫెడ్రిక్ డైరెక్ట్ చేశాడు. ఈసినిమా లో జ్యోతిక లాయర్ గా కనిపించనుంది. సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ సూర్య ఈ చిత్రాన్ని నిర్మించాడు అయితే  ఈచిత్రాన్ని థియేటర్లలో కాకుండా  డైరెక్ట్ గాఓటిటి లో విడుదలచేయడాన్ని థియేటర్ల యాజమాన్యం తప్పుబట్టింది. ఒకవేళ ఓటిటి లో విడుదలచేస్తే సూర్య సినిమాల విడుదల అడ్దుకుంటామని బెదిరించారు అయినా కూడా సూర్య  ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. 
 
ఇక ఈసినిమా కాకుండా మరో 6సినిమాలను ప్రైమ్ డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది అందులో భాగంగా కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్ జూన్ 19న తమిళ్ తోపాటు తెలుగులోనూ  విడుదలకానుంది. ఈశ్వర్ కార్తీక్ డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించాడు అలాగే కన్నడ మూవీ లా ,బిర్యానీ.. మళయాలం మూవీ సోఫియామ్ సుజాతీయం తోపాటు హిందీ సినిమాలు శకుంతలా దేవి ,గులాబో సితాబో థియేటర్ రిలీజ్ లేకుండా త్వరలోనే  ప్రైమ్ లో విడుదలకానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: