జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి ప్రియమణి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది అందులో ఒకటి విరాటపర్వం కాగా మరొకటి నారప్ప. ఈరెండు సినిమాలపై మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈరోజు ప్రియమణి తన పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈసందర్భంగా కొద్దీ సేపటి క్రితం విరాటపర్వం నుండి తన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ను విడుదచేసి ప్రియమణి కి శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర బృందం. ఈసినిమాలో ప్రియమణి ,కామ్రేడ్ భారతక్క గా నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. ప్రియమణి ఫస్ట్ లుక్ కుసూపర్ రెస్పాన్స్ వస్తుంది. 
 
ఇక తాజాగా నారప్ప చిత్ర బృందం కూడా ఈసినిమా నుండి ప్రియమణి ఫస్ట్ లుక్ ను విడుదలచేసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా ఆయనకు జోడిగా ప్రియమణి నటిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండగా ప్రముఖ తమిళ నిర్మాత కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈపాటికే ఈసినిమా విడుదలయ్యేది కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: