సల్మాన్ ఖాన్‌తో కలిసి 90 వ దశకంలో 'బంధన్', 'జుద్వా' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించిన రంభ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది సినీ ప్రేక్షకులను అలరించింది. రంభ అసలు పేరు విజయలక్ష్మి కాగా రంభ అని ఆమెను పిలిచే ముందు విజయలక్ష్మిని అమృత( ఆమె మొట్టమొదటిగా అమృత అనే క్యారెక్టర్ లో నటించింది) అని పిలిచేవారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో విజయలక్ష్మి రంభ పాత్రలో నటించగా... ఆమెకు ఆ పాత్ర పేరే అసలైన పేరుగా మారిపోయింది.

IHG
చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసిన రంభ సల్మాన్ ఖాన్ నటించిన రెండు చిత్రాలైన 'జుడ్వా', బంధన్ లో నటించి బాలీవుడ్ లో అగ్రతారగా ఎదిగింది. అనేక హిందీ సినిమాలలో విభిన్నమైన పాత్రలో నటించిన తర్వాత రంభ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో రూపుదిద్దుకున్న చిత్రాలలో కూడా నటించింది. హిందీ సినీ ప్రేక్షకులు చూడడానికి రంభ దివ్య భారతిలాగా ఉందని అనేవారు. ఆమె నటించిన కొన్ని హిందీ చిత్రాలు హిట్స్ అయ్యాయి కానీ ఆ తరువాత రంభ బాలీవుడ్ కెరీర్ క్షీణించడం ప్రారంభించింది. గతంలో రంభ చాలా నాచురల్ గా సన్నగా ఉండేది కానీ కాలక్రమేణా చాలా లావుగా తయారయ్యింది. ఏదేమైనా తన అందం మాత్రం చెక్కు చెదరలేదు.

IHG
1990లో దశాబ్దంలో తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ... తను మాత్రం కేవలం గ్లామర్ ఒలకబోసే పాత్రల్లోనే ఎక్కువగా నటించేది. నిర్మాతగా త్రీ రోసెస్ సినిమాను తెరకెక్కించగా... ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో బాగా నష్టపోయిన రంభ తన ఇల్లు అమ్ముకొని అప్పులన్నీ తీర్చింది. పెళ్లయిన తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు రియాలిటీ షోలలో డాన్స్ షోలలో న్యాయనిర్ణేతగా కనిపించింది రంభ. కన్నడ భాషలో 2005వ సంవత్సరంలో విడుదలైన పాండు రంగవిఠల సినిమాలో రవిచంద్రన్ సరసన నటించిన రంభ తన అందాలను ఆరబోస్తూ అత్యంత శృంగార భరితమైన సన్నివేశాల్లో బీభత్సంగా రెచ్చిపోయింది.

IHG

తమిళ కన్నడ మలయాళం చిత్రాల్లో ఎక్కువగా శృంగార భరితమైన పాత్రల్లో నటించింది రంభ. ఐటమ్ సాంగ్ లలో కూడా తన అందాలను ఆరబోస్తూ సినీ ప్రేక్షకులను బాగా అలరించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా లోని అట్టాంటోడే ఇట్టాంటోడే ఐటమ్ సాంగ్ లో ఎర్రటి డ్రస్సు ధరించిన రంభ తన హాట్ హాట్ అందాలను తెగ ఆరబోస్తూ ప్రేక్షకులకు మత్తెక్కించింది. డాన్సర్ నటుడు ప్రభుదేవాతో కూడా ఈమె రొమాన్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: