బాలీవుడ్‌ లో టీవీ క్వీన్‌ గా పేరు తెచ్చుకున్న భామ ఏక్తా కపూర్‌. ఈ రోజు ఈ భామ 45వ పుట్టిన రోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలీవుడ్‌ సీనియర్ హీరో జితేంద్ర వారసులిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎక్తా, హాట్ హాట్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా వివాదాస్పద సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది ఎక్తా.

 

ఎక్తా రూపొందించే టెలివిజన్‌ సీరియల్స్‌ ప్రైమ్ టైమ్ ‌లో వచ్చే టాప్‌ షోల రేటింగ్ ‌లకు సౌత్‌ షాక్‌ ఇచ్చేది. ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఇల్లీగల్‌ రిలేషన్స్, మ్యారేజ్‌ డ్రామస్‌ నేపథ్యంలో సినిమాలు రూపొందిస్తోంది ఏక్తా. అయితే ఎక్కువగా పెళ్లిళ్ల నేపథ్యంలోనే సినిమాలు సీరియల్స్ నిర్మించినా ఎక్తాకు పెళ్లిమీద నమ్మకం లేదట అందుకే తాను ఇంకా సింగిల్‌గానే ఉంటున్నానని వెల్లడించింది ఈ బ్యూటీ.

 

బ్యూటీ 2019లో సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని యాంకర్‌ ప్రశ్నించగా సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి అయిన రెండు మూడేళ్ల తరువాత చేసుకుంటానని సరదాగా  కామెంట్ చేసింది. మరో ఇంటర్వ్యూలో తండ్రి జితేంద్ర కారణంగా పెళ్లి చేసుకోలేదని చెప్పింది.

 

ఎక్తాను తండ్రి పని చేస్తావా..? పెళ్లి చేసుకుంటావా అని అడగటంతో తాను పని చేసేందుకు మొగ్గు చూపిందట. అంతేకాదు తనకు తెలిసి చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని కూడా ఇప్పుడు సింగిల్‌గా ఉంటున్నారని, గత కొద్ది సంవ్సతరాలుగా చాలా విడాకుల కేసులు చూశానని అందుకే పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: