నిజానికి ఈ బ్యూటీ జీవితం అంతా కూడా రహస్యమే. జీవితమంతా సాఫీగా గడుస్తున్న సమయంలో ఈ బ్యూటీ ప్రేమలో పడింది. అంతేకాదు వివాహం కూడా చేసుకుంది. ఈ విషయాన్ని బయటకు తెలిసే అవకాశాలు రాకపోవడంతో బయటకు తెలియకుండా జాగ్రత్త పడింది. అంతేకాకుండా ఆమె కొన్ని రోజులకు ప్రెగ్నెంట్ కూడా అయింది. అయినా కూడా ఆ విషయాన్ని బయటకు పెట్టలేదు ఆ హీరోయిన్.

 


ఆవిడా ఎవరోకాదు కామ్నా జెట్మలానీ. వాస్తవానికి ఆమె వ్యక్తిగత విషయాలను ఎందుకు అంతగా దాచింది అంటే... ఆమె గర్భవతి అనే విషయం చాలామంది మేకర్స్ తెలియక సినిమా ఆఫర్లతో సంప్రదించే వారట. కానీ ఆమె గర్భం చూసి ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి వెళ్ళి పోయే వారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయట పెట్టడం జరిగింది. గతంలో ఈమెకు మంచి స్క్రిప్ట్ ల తో మూవీ మెక్కర్స్ మంచి కధలను అందించారు. కానీ ప్రెగ్నెంట్ అవ్వడంతో యాక్టింగ్ కెరీర్ లో కొన్ని రోజులు పక్కన పెట్టేసి అని తెలియజేసింది. ఇక ఈ బ్యూటీకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

 


అయితే ఆ పిల్లలు ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యారు కాబట్టి మళ్ళీ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. మంచి పాత్రలు దొరికితే కచ్చితంగా తిరిగి నటిస్తాను అంటూ ఆమె తెలియచేసింది. తన సినీ కెరీర్ ప్రారంభంలో ఈమె గోపీచంద్, అల్లరి నరేష్ హీరోలతో కలిసి జతకట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో ఒక స్పెషల్ పాటలో కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఈ బ్యూటీ సినిమా కెరియర్ మళ్లీ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అలాగే లాక్ డౌన్ మొదలవ్వడం కంటే ముందే ఒక స్క్రిప్టుకు అంగీకరించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ బ్యూటీ బెంగళూరులో స్థిరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: