స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే నిహారికా మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. ఏ మాత్రం హడావుడి లేకుండా ఆమె సినిమాల్లో నటించే ప్రయత్నాలను చేస్తుంది. ఇప్పుడు ఆమెకు పెద్దగ ఆఫర్లు లేవు గాని వచ్చిన ఆఫర్లను మాత్రం ఆమె చాలా బాగా వాడుకునే ప్రయత్నాలు చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా కంటే ఇతర పాత్రల్లో నటించడానికే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

అయితే ఆమె విషయంలో చిరంజీవి కొన్ని కొన్ని సూచనలను నాగ బాబు కి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెను అనవసరంగా ఏ సినిమాలో కూడా హీరోయిన్ గా వద్దు అని గ్లామర్ పాత్రలకు నిహారిక వద్దు అని చెప్పారట చిరంజీవి. అవసరం అయితే చిన్న పాత్రలకు మాత్రమే ఆమెను ఎంపిక చెయ్యాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఇప్పుడు మరో వార్త కూడా వస్తుంది... ఆమె బాధ్యతను ఎక్కువగా రామ్ చరణ్ చూస్తున్నాడు అని అంటున్నారు. రామ్ చరణ్ తన తర్వాతి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా ఆమెకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఆ పాత్రకు సంబంధించి నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అని ఆమె టాలెంట్ ని ఆ పాత్రలో చూపించే అవకాశం ఉంటుంది అని చెప్పినట్టు సమాచారం. ఆమె ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు అని చెప్పారట రామ్ చరణ్. దీనిని నాగ బాబు కి కూడా చెప్పడం తో ఆయన కూడా ఓకే చేసినట్టు సమాచారం. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: