ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడం అనేది కాస్త కష్టమే అని చెప్పవచ్చు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి పెట్టుబడి పెట్టే పరిస్తితి దేశ వ్యాప్తంగా ఉంది అనేది వాస్తవం. ఇప్పుడు సినిమాల్లో పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి పెడుతున్నారు. అగ్ర హీరోల సినిమాలు అయినా సరే స్వేచ్చగా పెట్టుబడి పెట్టే వాతావరణం అయితే టాలీవుడ్ లో లేదు అని సినీ ప్రముఖులు అంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు చిరంజీవి నిర్మాతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారని టాక్. 

 

హీరో తో కూడా అనవసరంగా భారీ బడ్జెట్ సినిమాలు ఒప్పుకుని నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు అని దాని తో నష్టపోయే అవకాశం ఉందని సినిమాలకు చాలా కష్ట కాలం అని తన అనుభవంలో ఇంత దరిద్రాన్ని ఎప్పుడు చూడలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారట. దీనితో తాను కూడా ఇబ్బంది పడుతున్నా అని ఏ దర్శకుడు అయినా ఏ హీరో అయినా సరే సినిమాను చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచన చెయ్యాలి అని చెప్పినట్టు సమాచారం. తాను కూడా కొన్ని రోజుల పాటు భారీ సినిమాలను చేయను అని చెప్పారట. 

 

రామ్ చరణ్ కి కూడా ఇదే విషయాన్ని తాను చెప్పా అని ఆయన అన్నారట. అల్లు అరవింద్ కూడా ఇదే అభిప్రాయం చెప్పినట్టు తెలుస్తుంది. కుదిరితే ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కు తీసుకోవడం మంచిది అని ఆయన సూచనలు కూడా చేసారు అని అంటున్నారు. కాగా చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: