తెలుగు తెర మీద తిరగు లేని ప్రేమ కథ దేవదాసు. తెలుగు తెర మీదే కాదు దాదాపు ఇండియన్ భాషలన్నింటి లోనే సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా ఎన్నో సరికొత్త ట్రెండ్‌ లను తెర మీద కు తీసుకువచ్చింది. అప్పటి వరకు సినిమా అంటే ఎవరి కథ వాళ్లదే అన్నట్టుగా సాగేది. ఒక ప్రాంత సాంప్రదాయాలు, పద్దతులు ప్రకారం ఆ కథలు ఉంటాయని భావించేవారు. కానీ దేవదాసు అలా కాదు. ఎక్కడో ఓ బెంగాళీ రచయిత రాసి ఓ కథ ఇండియన్‌ స్క్రీన్‌ మీద సరికొత్త రికార్డ్ ‌లను సృష్టించింది.

 

అప్పటి వరకు సామాజిక సమస్యలను, పౌరాణిక గాథలను, జానపద కథలను మాత్రమే సినిమాలు గా తెరకెక్కిస్తున్న తరుణంలో నవలను కూడా సినిమా గా రూపొందించవచ్చని కొత్త ట్రెండ్‌కు స్వాగతం పలికింది దేవదాసు. అంతేకాదు సినిమాలకు విషాదాంతం ఉన్నా ప్రేక్షకులు స్వాగతిస్తారన్న నమ్మకం కలిగించిన సినిమా కూడా దేవదాసే. అందుకే ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ మీదే ఓ ట్రెండ్‌ సెట్టర్ అనిపించుకుంది.

 

తెలుగు విషయానికి వస్తే ఈ సినిమా ఎంతో మందికి బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు జానపద హీరో గా మాత్రమే పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వర రావును  రొమాంటిక్‌ స్టార్‌ ను చేసింది దేవదాసు. హీరోయిన్ ‌గా తొలి అడుగులు వేస్తున్న సావిత్రిని మహానటిగా ఎదిగేందుకు ఊతమిచ్చిన సినిమా దేవదాసు. అందుకే ఇండియన్ స్క్రీన్ మీద తిరుగులేని ప్రేమ కథగా దేవదాసు. వేదాంతం రాఘవయ్య దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీఎల్‌ నారయణ నిర్మించాడు. అప్పట్లో ఇండస్ట్రీ లో టాప్ స్టార్లు గా పేరున్న ఎస్వీ రంగారావు, చిలకలపూడి సీతారామాంజనేయులు, సురబి కమలాబాయ్ లాంటి వాళ్లు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: